Monkey Pox: టెక్సాస్ వ్యక్తికి మంకీ పాక్స్.. తొలి కేసు నమోదు.. ఆందోళనలో అమెరికా

| Edited By: Phani CH

Jul 17, 2021 | 12:09 PM

అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి అరుదైన ,మంకీ పాక్స్ వ్యాధి సోకింది. ఇక్కడ ఇది తొలి కేసని అంటువ్యాధుల నివారణా విభాగం అధికారులు తెలిపారు.

Monkey Pox: టెక్సాస్ వ్యక్తికి మంకీ పాక్స్.. తొలి కేసు నమోదు.. ఆందోళనలో అమెరికా
Monkeypox
Follow us on

అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి అరుదైన ,మంకీ పాక్స్ వ్యాధి సోకింది. ఇక్కడ ఇది తొలి కేసని అంటువ్యాధుల నివారణా విభాగం అధికారులు తెలిపారు. ఇటీవల నైజీరియాకు వెళ్లి వచ్చిన ఈ వ్యక్జ్తికి ఈ డిసీజ్ సోకిందని, అతడిని డల్లాస్ లోని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారని వీరు తెలిపారు. ఈ వ్యాధి ప్రజలకు ముప్పు కాకపోవచ్చునని అంటూనే..వారు ఈ వ్యాధిపట్ల అత్యంత అప్రమత్తత అవసరమని కూడాహెచ్చరించారు. 2003 లో మంకీ పాక్స్ అమెరికాను వణికించిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. ఇది సోకిన వ్యక్తితో ప్రయాణికుల్లో ఎవరైనా కాంటాక్టులో ఉన్నారా అని ఎయిర్ లైన్స్ తో బాటు స్థానిక అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఇది సీరియస్ వైరల్ రుగ్మత అని, ఫ్లూ వంటి లక్షణాలతో మొదలై, మొదట చేతులు, మోచేతులపై, చివరకు ముఖంపై కూడా పండ్ల వంటివి ఏర్పడుతాయని అంటువ్యాధుల నివారణా విభాగం తెలిపింది.

శ్వాస సంబంధమైన తుంపర్ల ద్వారా ఇది ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.. అయితే కోవిడ్ కారణంగా ప్రజలు మాస్కులు ధరిస్తున్నందున ప్రస్తుతానికి ఇది పెద్దగా వ్యాప్తి చెందే అవకాశం లేదని, కానీ ఆంక్షల సడలింపుతో అనేకమంది మాస్కుల ధారణకు స్వస్తి చెబుతున్నారని ఈ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.,

నైజీరియా సహా పశ్చిమ ఆఫ్రికాలో అనేక చోట్ల మంకీ పాక్స్ ఉందని, స్మాల్ పాక్స్ కోవలోనిదే ఇది కూడానని నిపుణులు తెలిపారు. బ్రిటన్, ఇజ్రాయెల్, సింగపూర్ లో కూడా ఈ వ్యాధి తాలూకు కేసులు నమోదయ్యాయి.దీంతో ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Tips For Common Cold: జలుబు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందా.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి

BS Yediyurappa: ఫలించిన హైకమాండ్ బుజ్జగింపులు.. కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామాకు రంగం సిద్ధం..?