Mobile Explodes: మొబైల్‌ రిపేరు చేస్తుండగా పేలిన బ్యాటరీ.. చెలరేగిన మంటలు.. వైరల్‌ అవుతున్న వీడియో..!

|

Nov 19, 2021 | 8:27 PM

Mobile Explodes: మొబైల్‌ ఫోన్‌లో అప్పుడప్పుడు మంటలు చెలరేగుతుంటాయి. సాధారణంగా ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో ఆపరేటింగ్‌ చేయడం, లేదా మాట్లాడటం వంటివి..

Mobile Explodes: మొబైల్‌ రిపేరు చేస్తుండగా పేలిన బ్యాటరీ.. చెలరేగిన మంటలు.. వైరల్‌ అవుతున్న వీడియో..!
Follow us on

Mobile Explodes: మొబైల్‌ ఫోన్‌లో అప్పుడప్పుడు మంటలు చెలరేగుతుంటాయి. సాధారణంగా ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో ఆపరేటింగ్‌ చేయడం, లేదా మాట్లాడటం వంటివి చేస్తుంటే బ్యాటరీ పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ మొబైల్‌ సెంటర్‌లో ఫోన్‌ రిపేరింగ్‌ చేస్తుండగా, ఒక్కసారిగా మంటల చెలరేగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నవంబర్‌ 5న వియత్నంలోని థాయ్‌ గుయెన్‌లోని ఓ మొబైల్‌ రిపేరింగ్‌ షాపులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడు సెకన్ల పాటు ఉన్న వీడియోలో రిపేరింగ్‌ చేస్తుండగా, పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. సెకను వ్యవధిలో ఒక్కసారిగా బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. వెంటనే మొబైల్‌ నుంచి మంటలు రావడంతో రిపేరు చేస్తున్న వ్యక్తి వెంటనే నేలపై విసిరేశాడు. ఈ వైరల్‌ అవుతున్న వీడియోను యూట్యూబ్‌ ఛానెల్‌ షేర్‌ చేసింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికి కూడా గాయాలు కాలేదు.

కాగా, ఇలాంటివి కూడా ఇళ్లల్లో చాలా జరిగాయి. అకస్మాత్తుగా బ్యాటరీ పేలి గాయాలు, మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు ఫోన్‌ చార్జింగ్‌ అవుతున్న సమయంలో కాల్స్‌ వస్తే అలాగే మాట్లాడటం, ఆపరేటింగ్‌ లాంటివి చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

BHIM App: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ నంబర్‌ ఉపయోగించి భీమ్‌ యాప్‌ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు.. ఎలాగంటే..!

Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!