Radioactive Capsule: ముట్టుకుంటే మసే.. పెద్ద దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోన్న చిన్న క్యాప్సుల్.. హై అలెర్ట్..

|

Jan 29, 2023 | 8:53 AM

ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన చిన్నపాటి క్యాప్సూల్‌ అధికారులను ముచ్చెమటలు పట్టిస్తోంది. అందులో రేడియోధార్మిక పదార్థం సీజియం‌- 137 ఉండటంతో అధికారులు దేశంలో హైఅలెర్ట్ ప్రకటించారు.

Radioactive Capsule: ముట్టుకుంటే మసే.. పెద్ద దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోన్న చిన్న క్యాప్సుల్.. హై అలెర్ట్..
Radioactive Capsule
Follow us on

ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన చిన్నపాటి క్యాప్సూల్‌ అధికారులను ముచ్చెమటలు పట్టిస్తోంది. అందులో రేడియోధార్మిక పదార్థం సీజియం‌- 137 ఉండటంతో అధికారులు దేశంలో హైఅలెర్ట్ ప్రకటించారు. రేడియేషన్‌ నేపథ్యంలో ఆ క్యాప్సుల్‌ను తాకినా దగ్గర ఉంచుకున్నా తీవ్ర అనారోగ్యానికి పాలవుతారు. దీనికి తోడు కాలిన గాయాలవుతాయని ఆస్ట్రేలియా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వస్తువేదైన కనిపిస్తే దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. 6 మిల్లి మీటర్ల వ్యాసం, 8 మిల్లి మీటర్ల పొడవు గల క్యాప్సూల్‌ను ఇటీవల ట్రక్కులో పశ్చిమ ఆస్ట్రేలియా న్యూమన్‌ ఉత్తర ప్రాంతంలోని ఓ సైట్ నుంచి పెర్త్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఎక్కడో పడిపోయింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు.. గాలింపు చేపట్టారు. 1400 కిలో మీటర్ల మేర వెదుతున్నారు. ఈ సీజియం‌- 137ను మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు. అంటే దాని తీవ్రత ఏవిధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్యాప్సుల్ రేడియేషన్‌ను విడుదల చేస్తోంది. దీంతో దాన్ని తాకినా తీవ్ర సమస్యలు వస్తాయి. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదని అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం హెచ్చరించింది.

ప్రజలను అప్రమత్తం చేస్తూ క్యాప్సూల్‌ ఫొటో విడుదల చేసింది. ఎవరికైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని డీఎఫ్‌ఈఎస్‌ సూచించింది. అంటే దాని తీవ్రత ఎలా ఉంది? అధికారులకు ఉన్న ఆందోళన ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..