AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LG ఎనర్జీ సొల్యూషన్స్ ప్లాంట్‌లో కెమికల్స్ లీక్.. భారీగా ప్రాణనష్టం..?

మిచిగాన్‌లోని హాలండ్‌ భారీ ప్రమాదం సంభవించింది. ఎల్‌జి ఎనర్జీ సొల్యూషన్స్ ప్లాంట్‌లో రసాయనం లీక్ కావడంతో అనేక మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని స్థానిక మీడియా తెలిపింది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య బృందాలు సహా అత్యవసర బృందాలు సంఘటనా స్థలంలోనే బాధితులకు చికిత్స అందిస్తున్నాయి.

LG ఎనర్జీ సొల్యూషన్స్ ప్లాంట్‌లో కెమికల్స్ లీక్.. భారీగా ప్రాణనష్టం..?
Lg Energy Solutions Plant
Balaraju Goud
|

Updated on: Sep 07, 2025 | 9:27 AM

Share

మిచిగాన్‌లోని హాలండ్‌ భారీ ప్రమాదం సంభవించింది. ఎల్‌జి ఎనర్జీ సొల్యూషన్స్ ప్లాంట్‌లో రసాయనం లీక్ కావడంతో అనేక మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని స్థానిక మీడియా తెలిపింది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య బృందాలు సహా అత్యవసర బృందాలు సంఘటనా స్థలంలోనే బాధితులకు చికిత్స అందిస్తున్నాయి. భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. చాలా మంది తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరగడానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తులో ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. రసాయనాన్ని అరికట్టడానికి, ప్రభావితమైన వారికి వైద్య సహాయం అందించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

శనివారం (సెప్టెంబర్ 6) మిచిగాన్‌లోని హాలండ్‌లోని LG ఎనర్జీ సొల్యూషన్ ప్లాంట్‌లో కెమికల్స్ లీక్ కావడంతో పదిహేను మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన 875 E 48వ వీధిలో జరిగిందని హాలండ్ అగ్నిమాపక విభాగం ఒక ప్రకటనలో ధృవీకరించింది. సంఘటనా స్థలం నుంచి ఉద్యోగులు, పరిసర ప్రాంతాల భద్రత దృష్ట్యా సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. LG ఎనర్జీ సొల్యూషన్ మిచిగాన్, HT.com కు ఇమెయిల్ చేసిన ప్రకటనలో ఈ సంఘటనను ధృవీకరించింది. దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని, గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచిన తర్వాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని LG ఎనర్జీ సొల్యూషన్ మిచిగాన్ తెలిపింది. గ్రాఫ్‌షాప్ ఫైర్ డిపార్ట్‌మెంట్, అమెరికన్ మెడికల్ రెస్పాన్స్, హాలండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు ఒట్టావా కౌంటీ సెంట్రల్ డిస్పాచ్ అన్నీ ఈ కార్యకలాపాలకు సహాయపడ్డాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..