AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mexico: తప్పిపోయిన ఏడుగురు కోసం వెదుకుతుంటే.. 45 సంచులలో ఉన్న మృత దేహాలు లభ్యం.. కాల్ సెంటర్ ఉద్యోగులుగా గుర్తింపు..

పోలీసులు పశ్చిమ మెక్సికన్ లోని జాలిస్కోలోని ఒక గుంటలో 45 బస్తాలను కనుగొన్నారు. వాటిని తెరిచి చూసిన అధికారులకు షాక్ ఇస్తూ..  అందులో మానవ శరీరాలు కనిపించాయి. మే 20 నుంచి తప్పిపోయిన 30 ఏళ్లలోపు ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులను మాత్రమే కాదు గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన వ్యక్తుల కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు.

Mexico: తప్పిపోయిన ఏడుగురు కోసం వెదుకుతుంటే.. 45 సంచులలో ఉన్న మృత దేహాలు లభ్యం.. కాల్ సెంటర్ ఉద్యోగులుగా గుర్తింపు..
Mexico City
Surya Kala
|

Updated on: Jun 02, 2023 | 1:10 PM

Share

మెక్సికోలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర మెక్సికోలోని గ్వాడలజారా శివార్లలోని ఒక పెద్ద రాళ్ల గుట్టల మధ్య మృత దేహాలున్న సంచులను అధికారులు కనుగొన్నారు. ఈ సంచులను చూసిన స్థానికులు షాక్ తిన్నారు. పోలీసులు గత వారం తప్పి పోయిన కొందరు యువతీయువకుల కోసం వెదుకుతున్న సమంయంలో ఈ సంచులు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు పశ్చిమ మెక్సికన్ లోని జాలిస్కోలోని ఒక గుంటలో 45 బస్తాలను కనుగొన్నారు. వాటిని తెరిచి చూసిన అధికారులకు షాక్ ఇస్తూ..  అందులో మానవ శరీరాలు కనిపించాయి. మే 20 నుంచి తప్పిపోయిన 30 ఏళ్లలోపు ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులను మాత్రమే కాదు గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన వ్యక్తుల కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు.

కనిపించకుండా పోయిన యువతీయువకులు ఒకే కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారని.. తప్పిపోయిన వారి గురించి వేర్వేరు రోజుల్లో ఫిర్యాదులు అందాయని చెప్పారు పోలీసులు. ఇప్పుడు మృతదేహాలు లభ్యమైన దగ్గరలోనే కాల్ సెంటర్ ఉంది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు మొదలు పెట్టారు. సంచుల్లో ఉన్న మృతులు ఎంతమంది.. ఎవరెవరు అనే విషయం ఫోరెన్సిక్ నిపుణులు  నిర్ధారించాల్సి ఉంది.

కాల్ సెంటర్ అక్రమ కార్యకలాపాలకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తెలిసినట్లు అధికారులు చెప్పారు. గంజాయి,తో పాటు దుస్తులపై రక్తపు మరకలు.. బ్లడ్ ఉన్న క్లీనింగ్ రాగ్‌తో పాటు వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను కనుగొన్నారని స్థానిక మీడియా నివేదించింది. అయితే అధికారులు బాధితులను నేరస్తులుగా చిత్రీకరించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు అదృశ్యమైన వారి బంధువులు.

ఇవి కూడా చదవండి

2021లో జాలిస్కోలోని తోనాలా మున్సిపాలిటీలో, 11 మంది మానవ అవశేషాలతో 70 సంచులు  కనుగొనబడ్డాయి. అంతేకాదు 2019 లో, జపోపాన్‌లోని జనావాసాలు లేని ప్రాంతంలో 119 బ్యాగుల్లో 29 మంది మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో 33 మంది అవశేషాలు గ్వాడలజారా ప్రాంతంలో కనిపించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం
అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం
తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు..?
తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు..?
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ రైళ్లు..!
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ రైళ్లు..!
సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు?
సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు?
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..