పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 13 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు..
పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారని తెలిసింది. సమీపంలోని భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కారణాలు ఇంకా తెలియనప్పటికీ, సీసీటీవీ ఫుటేజ్‌లో పేలుడు దృష్యాలు రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పాకిస్తాన్ బలూచిస్థాన్‌లోని క్వెట్టా జర్ఘున్ రోడ్ సమీపంలో ఉన్న ఫ్రంటియర్ కోర్స్ హెడ్‌క్వార్టర్స్ దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని తెలిసింది. సమీపంలోని భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కారణాలు ఇంకా తెలియనప్పటికీ, సీసీటీవీ ఫుటేజ్‌లో పేలుడు దృష్యాలు రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పేలుడు శబ్దం మైళ్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించడానికి అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు పదార్థాలు నిండిన వాహనం మోడల్ టౌన్ నుండి హాలి రోడ్ వైపు, ఫ్రాంటియర్ కాన్స్టాబులరీ (FC) ప్రధాన కార్యాలయానికి సమీపంలో మలుపు తీసుకుంటుండగా పేలుడు సంభవించింది. ఈ మేరకు క్వెట్టా స్పెషల్ ఆపరేషన్స్ SSP ముహమ్మద్ బలోచ్ తెలిపారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రాంతీయ ఆరోగ్య మంత్రి బఖత్ కాకర్ తెలిపారు. బలూచిస్తాన్ చాలా కాలంగా స్వాతంత్ర్యం కోరుతూ నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి గ్రూపుల హింసతో ఇబ్బంది పడుతోంది. భారీ పేలుడుతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి.
వీడియో ఇక్కడ చూడండి..
⚡️POWERFUL explosion ROCKS FC headquarters in Quetta, Pakistan — multiple reports
Gunfire reported and multiple fatalities pic.twitter.com/ExBz4kd2kN
— RT (@RT_com) September 30, 2025
సెప్టెంబర్ 3న క్వెట్టాలో ఒక రాజకీయ ర్యాలీలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 11 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్తాన్ నేషనల్ పార్టీ (బిఎన్‌పి) మద్దతుదారులు వందలాది మంది గుమిగూడిన స్టేడియం కార్ పార్కింగ్‌లో ఈ పేలుడు జరిగింది. పాకిస్తాన్ దళాలు బలూచిస్తాన్‌లో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న తిరుగుబాటుతో పోరాడుతున్నాయి. 2024లో 782 మంది మరణించారు. మార్చిలో, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక రైలును స్వాధీనం చేసుకుంది. విధుల్లో లేని సైనికులను చంపింది. జనవరి నుండి బన్నులో ఆరుగురు సైనికులతో సహా 430 మందికి పైగా దాడుల్లో మరణించారు. వీరిలో ఎక్కువగా భద్రతా సిబ్బంది ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




