అల్లకల్లోలం.. టైఫూన్ బూలోయ్ విధ్వంసం.. లక్షలాది మంది చెల్లాచెదురు.. వీడియో
టైఫూన్ బూలోయ్ విధ్వంసం మామూలుగా లేదు. ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాల్లో కల్లోల వాతావరణం కనిపిస్తోంది. తుఫాను ధాటికి ఇళ్లు, భవనాలు, చెట్లూ, పంటపొలాలు, వణ్యప్రాణుల నుంచి.. మూగ జీవాల వరకు.. అంతా ఈ భయానక తుఫానుకు చెల్లాచెదురైపోయాయి. వేలాది నిర్మాణాలు కుప్పకూలిపోయాయి..

టైఫూన్ బూలోయ్ విధ్వంసం మామూలుగా లేదు. ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాల్లో కల్లోల వాతావరణం కనిపిస్తోంది. తుఫాను ధాటికి ఇళ్లు, భవనాలు, చెట్లూ, పంటపొలాలు, వణ్యప్రాణుల నుంచి.. మూగ జీవాల వరకు.. అంతా ఈ భయానక తుఫానుకు చెల్లాచెదురైపోయాయి. నిర్మాణాలు కుప్పకూలిపోయాయి.. ఊర్లకు ఊర్లు వరదల ధాటికి నీటమునిగాయి. వాగులు పొంగాయి.. వరదలు ముంచెత్తాయి. టోటల్ లాస్. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు. రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసినా.. అక్కడా అదే పరిస్థితి. ఫిలిప్పీన్స్‌లో 27మంది.. వియత్నాంలో 13 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది.
రెండు దేశాల్లో కలిపి 4లక్షల మంది చెల్లాచెదురైపోయారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వియత్నాంలో 44వేల200 ఇళ్లు డ్యామేజ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. నిన్ తిన్హ్ ప్రావిన్స్‌లో 9మంది చనిపోగా.. 20మంది గల్లంతయ్యారు. 53వేల మందిని స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులకు తరలించారు. నాలుగు ఎయిర్‌పోర్టులు ధ్వంసం అవ్వడంతో 180కి పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. నాలుగు జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి.
ఫిలిప్పీన్స్‌లో విధ్వంసకాండ సృష్టించిన ఈ బూలోయ్ టైఫూన్ క్రమంగా బలపడుతూ వియత్నాంపైనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీనికి కారణం గ్లోబల్ వార్మింగే అంటున్నారు నిపుణులు. క్రమంగా పెరుగుతున్న వేడిమి వల్ల టైఫూన్ మరింత ఉధృతంగా మారినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆ టైఫూన్ బలహీనపడుతున్నా.. వారం తర్వాతే ప్రశాంత వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
వీడియో చూడండి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
