AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో దారుణం..తల్లి మృతదేహాన్ని 13 ఏళ్లుగా ఇంట్లోనే దాచిపెట్టిన కుమారుడు

పొలండ్ లో తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఓ వ్యక్తి ఏళ్లపాటు జీవిస్తున్న ఘటన ఇటీవల వెలుగుచూసింది. మరో విషయం ఏంటంటే మృతదేహం పాడవకుండా ప్రత్యేకంగా భద్రపరచి ఇంట్లో సోఫాలోనే ఉంచడం గమనార్హం

వామ్మో దారుణం..తల్లి మృతదేహాన్ని 13 ఏళ్లుగా ఇంట్లోనే దాచిపెట్టిన కుమారుడు
Death
Aravind B
|

Updated on: Mar 29, 2023 | 8:32 PM

Share

పొలండ్ లో తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఓ వ్యక్తి ఏళ్లపాటు జీవిస్తున్న ఘటన ఇటీవల వెలుగుచూసింది. మరో విషయం ఏంటంటే మృతదేహం పాడవకుండా ప్రత్యేకంగా భద్రపరచి ఇంట్లో సోఫాలోనే ఉంచడం గమనార్హం. ఇలా దాదాపు 13 ఏళ్లుగా మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని నివసిస్తున్న ఘటన అక్కడి స్థానికులును భయబ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే పోలండ్‌ రాడ్లిన్‌లోని రోగోజినా వీధిలో మరియన్‌ ఎల్‌ అనే వ్యక్తి ఉంటున్నాడు. అతని ఇంటికి ఇటీవల ఆయన బంధువు ఒకరు వచ్చారు. ఆ సమయంలో మరియన్‌ విచిత్ర చూపులు చూస్తూ ఇంటిబయట తిరుగుతున్నట్లు గమనించాడు. మరియన్ ప్రవర్తనపై అనుమానం ఆయనకు వచ్చింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి గాలించగా.. అక్కడున్న ఓ సోఫా మీద వార్తాపత్రిక కట్టలపై ఓ మృతదేహాన్ని ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించగా.. ఆ వార్తాపత్రికలు కూడా 2009 సంవత్సరం నుంచి ఉన్నట్లు గుర్తించారు.

ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆ ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడున్న మృతదేహాన్ని చూసి కంగుతిన్నారు. గతంలో మరణించిన అతడి తల్లి మృతదేహం అయి ఉంటుందని అనుమానించారు. 2010 జనవరి అతడి తల్లి చనిపోయినట్లు గుర్తించారు. అయితే ఆమెను ఖననం చేసిన ప్రదేశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. అనంతరం సమీపంలోనే ఉన్న శ్మశానవాటిలో అతడి తల్లి శవపేటికను తెరచిచూడగా అది ఖాళీగా కనిపించింది. దీంతో అంత్యక్రియల అనంతరం ఆమెను పూడ్చిపెట్టిన కొన్ని గంటలకే దాన్ని తవ్వి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చాడని పోలీసులు నిర్ధారించారు. రసాయనాలతో భద్రపరచడం వల్లే ఇన్నాళ్లు మృతదేహం కుళ్లిపోలేదని తెలిపారు. మరియన్ ను అరెస్టు చేసి అతడి మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యుల సహాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?