ఒక వ్యక్తి ఐదు అంగుళాల ఎత్తు పెరగడానికి 1.35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. అమెరికాలోని ఓ వైద్యుడు లెగ్ లెంథెనింగ్ సర్జరీ చేసి ఆయనను ఐదు అంగుళాల పొడవు పెంచాడు. ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. అమెరికాలోని మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌కు చెందిన 41 ఏళ్ల మోసెస్ గిబ్సన్, తన డేటింగ్ జీవితాన్ని ఎంజాయ్ చేయటం కోసం.. అరుదైన ఆపరేషన్ చేయించుకున్నాడు. దాంతో అతడు పొడవుగా పెరిగాడు.
జూన్ నాటికి మోసెస్ తన టార్గెట్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు సాధించడానికి రెండు విధానాలపై మొత్తం $165,000 (రూ. 1.35 కోట్లు) వెచ్చించాడు . మోసెస్ గతంలో కంటే ప్రస్తుతం ఐదు అంగుళాలు పొడవుగా ఉన్నాడు. మోసెస్ పొట్టిగా ఉన్నందున, అతని ప్రేమ జీవితం సమస్యగా మారింది. పైగా అతన్ని అందరూ పొట్టివాడు అని ఆటపట్టించేవారు. కానీ, ఇప్పుడు అతడు ఎత్తుకు ఎదిగి ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు.
మోషే చిన్నప్పుడు 5 అడుగుల 5 అంగుళాల పొడవు ఉండేవాడు. పొడవుగా ఎదగాలనే ప్రయత్నంలో ఆయుర్వేదం, వైద్యం, రకరకాల మందులు వాడినా ఎత్తు పెరగలేదు. ఆపై అతను శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముందుకు వచ్చాడు. రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా, పగలు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తూ డబ్బు సంపాదించాడు. గత నెలలో శస్త్రచికిత్స జరిగింది. ఈ సర్జరీలో తొడ ఎముకను విరగొట్టి అతికించాల్సి ఉంటుందని డాక్టర్ వివరించారు.
ఈ ఆపరేషన్ గురించి మాట్లాడుతూ, ఈ సర్జరీ స్వల్ప సమయంలోనే అయిపోతుందని, కానీ, రికవరీ ప్రాసెస్ పెద్దగా ఉంటుందని చెప్పారు. ఇది కొన్ని నెలలు పడుతుందని చెప్పాడు. ఒక ఇంచు ఎత్తు పెరగడానికి 25 రోజులు పడుతుందని, మిగతా ఇంచుల కోసమే రెండున్నర నెలలు పట్టిందని తెలిపాడు.
PHOTOS: Man Undergoes Height Lengthening Surgery To Grow Taller
A man, Moses Gibson, from Minneapolis, Minnesota in the United States, has undergone a leg surgery to add five inches to his height after struggling to talk to women for years due to self-doubt about his stature. pic.twitter.com/Pgsac5G8LC
— Mr Eze (@EzeJude46700373) April 13, 2023
ఎత్తు పెంచడానికి పేషెంట్ తొడ ఎమును విరగొడతామని, అందులో అడ్జస్టబుల్ మెటల్ నెయిల్ బిగిస్తామని పేర్కొన్నాడు. ఆ నెయిల్స్ మూడు నెలలపాటు ప్రతి రోజూ కొంత పెరుగుతుందని చెప్పాడు. మ్యాగ్నెటిక్ రిమోట్ కంట్రోల్ సహాయంతో మూడు నెలల్లో ఈ నెయిల్‌ను ఎక్స్‌టెండ్ చేయాల్సి ఉంటుందని వివరించాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..