Real Life Mowgli: జాతి, కుల, పేద, ధనిక వివక్ష కారణంగా చాలామంది నిరాదరణకు గురడం చూశాం. కానీ రూపం కారణంగా నిరాదరణకు గురై అడవుల పాలయ్యాడు ఓ వ్యక్తి. ఇది అత్యంత అమానుషంగా చెప్పుకోవచ్చు. కానీ అదే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. అతనెవరో.. అసలు అడవిలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. మళ్ళీ ఇన్నేళ్లకు స్కూల్ కు ఎలా వెళ్తున్నాడు విరాల్లోకి వెళ్తే..
రువాండాకు చెందిన 22 ఏళ్ల జాంజిమాన్ ఎల్లీ “మైక్రోసెఫాలీ” అనే రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి లక్షణం శిశువు తల సాధారణంగా ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉండటం. ఈ కారణంగా జాంజిమాన్‌ను అందరూ మోగ్లీ అంటూ పిలిచేవారు. ఈ వ్యాధే అతన్ని ప్రజలకు దూరంగా అడవిలో నివశించేలా చేసింది. దీనికి తోడు అతనికి వినికిడి, మాట్లాడలేని సమస్యలు కూడా ఉన్నాయి. ఎల్లీకి తండ్రి కూడా లేకపోవడంతో తల్లి అతడిని పెంచలేక అడవికి వెళ్లి గడ్డి తినమని బలవంతం చేస్తుండేది.
అయితే అఫ్రిమాక్స్ అనే ప్రాంతీయ టీవి చానల్ గో ఫండ్ అనే వెబ్‌సైట్ ద్వారా అతనికి మనమంతా సాయం చేద్దాం అంటూ ప్రచారం చేసింది. దీంతో అనేకమంది అతనికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఎల్లీ.. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో చేరాడు. అతని స్కూల్ యూనిఫాం కస్టమ్ మేడ్ సూట్ ధరించి కెమెరాకు ఫోజులిస్తున్నాడు. దాంతో ఎల్లి తల్లి సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పుడు తమ జీవితాలు మారిపోయాయని, తమకు ఉండేందుకు ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు… మా బాధలన్నీ ఒక్క నిమిషంలో దూరం చేశారు” అంటూ సంబరపడిపోయింది. ఇక సూట్ ధరించి నవ్వుతూ ఫోజులిస్తున్న ఎల్లీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తలచుకుంటే ఎటువంటి వారి జీవితాలైనా మార్చగలరు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అస్సాంలో దారుణం.. జీన్స్ ధరించిందని యువతిపై షాపు యజమాని దాడి..