ఇండియాతో కాళ్లబేరానికి వస్తున్న మలేషియా

పొద్దున్నలేస్తే భారత్‌ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న మలేషియాకు నరేంద్రమోదీ ప్రభుత్వం చుక్కలు చూపించింది… పామాయిల్‌తో మలేషియా మెడలు వంచేసింది… పామాయిల్‌ దిగుమతులను మలేషియా నుంచి తగ్గించి.. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది భారత ప్రభుత్వం… మలేషియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై భారీగా దిగుమతి పన్ను విధించింది.. వాస్తవానికి మలేషియా నుంచి ప్రతి సంవత్సరం 40 లక్షల టన్నుల పామాయిల్‌ భారత్‌కు వస్తుంది.. ఇదంతా ఆగిపోయేసరికి మలేషియా ప్రధానికి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. ఇప్పుడా […]

ఇండియాతో కాళ్లబేరానికి వస్తున్న మలేషియా
Follow us

|

Updated on: Feb 04, 2020 | 8:16 PM

పొద్దున్నలేస్తే భారత్‌ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న మలేషియాకు నరేంద్రమోదీ ప్రభుత్వం చుక్కలు చూపించింది… పామాయిల్‌తో మలేషియా మెడలు వంచేసింది… పామాయిల్‌ దిగుమతులను మలేషియా నుంచి తగ్గించి.. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది భారత ప్రభుత్వం… మలేషియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై భారీగా దిగుమతి పన్ను విధించింది.. వాస్తవానికి మలేషియా నుంచి ప్రతి సంవత్సరం 40 లక్షల టన్నుల పామాయిల్‌ భారత్‌కు వస్తుంది.. ఇదంతా ఆగిపోయేసరికి మలేషియా ప్రధానికి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. ఇప్పుడా దేశానికి తత్వం బోధపడింది.. కాళ్లబేరానికి వచ్చింది.. వాణిజ్యపరంగా భారత్‌తో తలెత్తిన విభేదాలు త్వరలో సమసిపోతాయని మలేషియా పరిశ్రమల శాఖ మంత్రి థెరిసా కోక్‌ చెప్పడం ఈ కోవకే వస్తుంది.. మలేషియా పామాయిల్‌ ఉత్పత్తులపై భారత్‌ విధించిన నిషేధం తాత్కాలికమైనదని.. త్వరలో నిషేధాన్ని ఎత్తివేస్తుందన్న నమ్మకం తమకుందని థెరిసా కోక్‌ చెప్పుకొచ్చారు.. భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మలేషియా ప్రధాని మహతీర్‌ విమర్శిస్తూ వచ్చారు.. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నుంచి మొదలు పెడితే మొన్నీమధ్య సీఏసీ వరకు మహతీర్‌ ఏదో ఒకటి అనసాగారు.. అంతెందుకు కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతమనే సాహసం చేశారు.. ఇలాగైతే లాభం లేదనుకున్న నరేంద్రమోదీ వాణిజ్యపరంగా మలేషియాను గట్టి దెబ్బకొట్టారు.. ప్రపంచంలోనే పామాయిల్‌ అతి పెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్‌… మలేషియా పామాయిల్‌ను కొనకూడదని నిర్ణయించింది.. మలేషియాకు బదులు ఇండోనేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సిందిగా వ్యాపార సంస్థలకు చెప్పింది.. దీంతో మలేషియా తీవ్ర నష్టాల్లోపడింది.. ఇలాగైతే ఎలారా భగవంతుడా అని అనుకుని భారత్‌ను దువ్వే ప్రయత్నం మొదలుపెట్టింది.. అందులో భాగంగానే మలేషియా మంత్రి థెరిసా కోక్‌ సంధిని కాంక్షించే మాటన్నారు.. భారత్‌-మలేషియాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని.. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను రెండు దేశాలు అధిగమిస్తాయని భావిస్తున్నామని… పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని అనుకుంటున్నామని కోక్‌ అన్నాడు. పామాయిల్‌ కొనుగోలుపై ఇండియా నిర్ణయం తాత్కాలికమేనని తాము అనుకుంటున్నామని తెలిపాడు..

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక