‘కరోనా’కు మందు దొరికేసింది!
ప్రస్తుతం కరోనా వైరస్.. అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ కరోనాకి ప్రపంచం మొత్తం షేక్ అవుతోంది. కరోనా దెబ్బకి.. చైనా వ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 300 మందికి పైగా మృతి చెందారు. ఇంకా కొన్ని వేల కేసులు నమోదయ్యాయి. కాగా.. భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి మలేషియాలో మృతి చెందాడు. ఇన్ని రోజులైనా.. ఈ ప్రమాదకర వైరస్‌కి మందును కనిపెట్టలేకపోతున్నారు. తాజాగా థాయ్‌లాండ్‌లో కరోనాకి మందు కనిపెట్టామని ఆ ప్రభుత్వం తెలియజేసింది. కాక్టెయిల్ వల్ల […]
ప్రస్తుతం కరోనా వైరస్.. అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ కరోనాకి ప్రపంచం మొత్తం షేక్ అవుతోంది. కరోనా దెబ్బకి.. చైనా వ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 300 మందికి పైగా మృతి చెందారు. ఇంకా కొన్ని వేల కేసులు నమోదయ్యాయి. కాగా.. భారతదేశానికి చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి మలేషియాలో మృతి చెందాడు. ఇన్ని రోజులైనా.. ఈ ప్రమాదకర వైరస్‌కి మందును కనిపెట్టలేకపోతున్నారు. తాజాగా థాయ్‌లాండ్‌లో కరోనాకి మందు కనిపెట్టామని ఆ ప్రభుత్వం తెలియజేసింది. కాక్టెయిల్ వల్ల కరోనా వైరస్ తగ్గుతుందని థాయ్ ప్రభుత్వం పేర్కొంది. కరోనా వైరస్ సోకిన ఓ 71 ఏళ్ల వృద్ధుడికి సాధారణ ఫ్లూ చికిత్సకు ఉపయోగించే కాక్టెయిల్‌ను మందుగా ఇచ్చామని.. అతనికి 48 గంటల్లో రోగం తగ్గి, నార్మల్ అయిపోయాడని థాయ్‌లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా జారీ చేసింది. ఈ వార్తతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.