బ్యాడ్ సెంటిమెంట్.. భరోసా ఇచ్చిన బన్నీ..!

అల వైకుంఠపురములో ఇచ్చిన విజయంతో మంచి ఊపులో ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఆ మూవీ కోసం కొత్త లుక్‌లోకి మారేందుకు ప్రస్తుతం బన్నీ కసరత్తులు చేస్తుండగా.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే తమిళ డైరక్టర్‌ మురగదాస్‌కు కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దర్బార్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మురగదాస్, ఇటీవల బన్నీని […]

బ్యాడ్ సెంటిమెంట్.. భరోసా ఇచ్చిన బన్నీ..!

అల వైకుంఠపురములో ఇచ్చిన విజయంతో మంచి ఊపులో ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఆ మూవీ కోసం కొత్త లుక్‌లోకి మారేందుకు ప్రస్తుతం బన్నీ కసరత్తులు చేస్తుండగా.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే తమిళ డైరక్టర్‌ మురగదాస్‌కు కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దర్బార్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మురగదాస్, ఇటీవల బన్నీని కలిసి ఓ కథను చెప్పారట. దాన్ని విన్న వెంటనే ఓకే చెప్పిన బన్నీ, ఫుల్ స్క్రిప్ట్‌తో రావాలని కోరారట.

అయితే తెలుగులో మురగదాస్‌కు బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. తెలుగు హీరోలైన చిరంజీవి, మహేష్ బాబులతో ఇప్పటివరకు సినిమాలను తీశారు మురగదాస్. అయితే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కానీ ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను బన్నీ పట్టించుకోవడం లేదట. కథపై, మురగదాస్‌పై నమ్మకం కలిగిన బన్నీ.. స్క్రిప్ట్‌ ఫైనల్ తరువాత ఈ చిత్రంలో నటిస్తానని ఆయనకు హామీ ఇచ్చారట బన్నీ. దీంతో మురగదాస్ ఆ పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎంత త్వరగా మురగదాస్ స్క్రిప్ట్‌ను పూర్తి చేస్తే.. అంత త్వరగా ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఎమ్‌సీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే చిత్రానికి కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నీ కుదిరితే సుకుమార్ మూవీ తరువాత ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాలీవుడ్‌ టాక్.

Published On - 6:42 pm, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu