‘నో’ చెప్పిన మెగాస్టార్.. స్పందించిన లేడి డైరక్టర్..!

కథల విషయంలో మెగాస్టార్‌ చిరంజీవికి మంచి పట్టు ఉంటుంది. అందుకే ఆయనను ఒప్పించడమన్నది అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆయనను మెప్పించలేకపోయిన సందర్భాలు చాలానే ఉంది. ఇదిలా ఉంటే తన కథలతో పాటు మెగా హీరోల కథలను కూడా చిరంజీవి వింటూ ఉంటారన్న టాక్ ఫిలింనగర్‌లో ఉంది. చిరు ఓటేసిన కథల్లో నటించిన మెగా హీరోలు కూడా పలు హిట్లను తమ ఖాతాలో వేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఉదాహరణకు ‘రంగస్థలం’, ‘చిత్రలహరి’, […]

'నో' చెప్పిన మెగాస్టార్.. స్పందించిన లేడి డైరక్టర్..!

కథల విషయంలో మెగాస్టార్‌ చిరంజీవికి మంచి పట్టు ఉంటుంది. అందుకే ఆయనను ఒప్పించడమన్నది అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆయనను మెప్పించలేకపోయిన సందర్భాలు చాలానే ఉంది. ఇదిలా ఉంటే తన కథలతో పాటు మెగా హీరోల కథలను కూడా చిరంజీవి వింటూ ఉంటారన్న టాక్ ఫిలింనగర్‌లో ఉంది. చిరు ఓటేసిన కథల్లో నటించిన మెగా హీరోలు కూడా పలు హిట్లను తమ ఖాతాలో వేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఉదాహరణకు ‘రంగస్థలం’, ‘చిత్రలహరి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సరైనోడు’, ‘మగధీర’ వంటి కథలకు ముందు చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాతే అవి సెట్స్ మీదకు వెళ్లి పెద్ద హిట్లుగా మారినట్లు టాక్.

ఇదిలా ఉంటే ఇటీవల ఓ డైరక్టర్‌ మెగాస్టార్‌ను మెప్పించలేకపోయినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌లో లేడి డైరక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నందినీ రెడ్డి గతేడాది ఓ బేబితో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ఇచ్చిన హిట్ ఊపుతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కోసం ఓ కథను సిద్ధం చేసిందట నందినీ రెడ్డి. ఇక ఈ కథను మొదట చిరుకు వినిపించాలని వైష్ణవ్ సూచించారట. దీన్ని విన్న చిరు కొన్ని మార్పులను సూచించారట. ఆ తరువాత మార్పులు చేసుకొని మరో కథను తయారు చేసుకొని వచ్చినప్పటికీ.. ఆ కథ కూడా చిరుకు కనెక్ట్ అవ్వలేకపోయిందట. దీంతో నో చెప్పేశాడట మెగాస్టార్.

అయితే ఈ కథనాలపై తాజాగా స్పందించింది నందినీ రెడ్డి. రైటర్లు, డైరక్టర్లు స్టోరీలను రాయాలి కానీ వారి కంటే మీడియా వారే ఎక్కువ క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నట్లు తనకు అనిపిస్తోంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ‘‘నా తదుపరి సినిమాపై ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తున్నారు. ఇంకా ఏం రాస్తారో ఎదురుచూస్తున్నా. వీటిన్నింటికి త్వరలోనే క్లారిటీ ఇస్తాను ’’ అంటూ నందినీ రెడ్డి చెప్పుకొచ్చింది. కాగా వైష్ణవ్ తేజ్ ఉప్పెన అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే.

Click on your DTH Provider to Add TV9 Telugu