AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌కు అమెరికన్ల షాక్.. అభిశంసనపై సర్వే రిపోర్ట్ అదుర్స్ !

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అభిశంసించాలని అమెరికన్‌ ప్రజలు కోరుకుంటున్నారా? ప్రజాభిప్రాయాన్ని గమనిస్తే అవుననే సమాధానం వస్తోంది. దాదాపు 51 శాతం మంది అమెరికన్ ప్రజలు అభిశంసన వైపే మొగ్గు చూపుతున్నారని ఒక వార్తా సంస్థ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ చెబుతోంది. ట్రంప్‌ తన ప్రత్యర్థి జో బిడెన్‌ కుటుంబం ఉక్రెయిన్‌లో నిర్వహిస్తున్న వ్యాపారాలపై విచారణ జరపాలని ఆ దేశ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా చట్ట సభల్లో ఆయనపై అభిశంసన చేపట్టిన సంగతి తెలిసిందే. […]

ట్రంప్‌కు అమెరికన్ల షాక్.. అభిశంసనపై సర్వే రిపోర్ట్ అదుర్స్ !
Rajesh Sharma
|

Updated on: Nov 19, 2019 | 5:51 PM

Share

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అభిశంసించాలని అమెరికన్‌ ప్రజలు కోరుకుంటున్నారా? ప్రజాభిప్రాయాన్ని గమనిస్తే అవుననే సమాధానం వస్తోంది. దాదాపు 51 శాతం మంది అమెరికన్ ప్రజలు అభిశంసన వైపే మొగ్గు చూపుతున్నారని ఒక వార్తా సంస్థ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ చెబుతోంది. ట్రంప్‌ తన ప్రత్యర్థి జో బిడెన్‌ కుటుంబం ఉక్రెయిన్‌లో నిర్వహిస్తున్న వ్యాపారాలపై విచారణ జరపాలని ఆ దేశ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా చట్ట సభల్లో ఆయనపై అభిశంసన చేపట్టిన సంగతి తెలిసిందే.

వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి పదవి నిలుపుకోవాలని ఆరాటపడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల జరిగిన మూడు కీలక రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో అధికార రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల ఓటమి, ప్రతిపక్ష డెమోక్రాట్‌ పార్టీ అభ్యర్థుల విజయం ట్రంప్‌కు మింగుడు పడటం లేదు.. మరోవైపు ఆయనపై అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై బహిరంగ విచారణ ట్రంప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

వచ్చే సంవత్సరం జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష డెమెక్రాట్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి పోటీ ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జో కుటుంబం ఉక్రెయిన్‌లో నిర్వహిస్తున్న వ్యాపారాలపై విచారణ జరపాలని ఆ దేశ అధ్యక్షునిపై ట్రంప్‌ వత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రంప్‌ చర్యలు అమెరికా సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సి పెలోసి ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు.

డెమెక్రాట్లు అధికంగా ఉండే హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ ట్రంప్‌ అభిశంసనకు అనుకూలంగా మొగ్గు చూపగా, రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న సెనెట్‌లో ఆయన గట్టెక్కే అవకాశాలున్నాయి. అయితే అధ్యక్షుడు ట్రంప్‌ అభిశంసనపై హౌస్‌ ఆఫ్‌ ఇంటలిజెన్స్‌ జరుపుతున్న బహిరంగ విచారణ ఆయనకు ముచ్చెమటలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఎబిసి న్యూస్-ఇప్సోస్ పోల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌ 51 శాతం మంది అమెరికన్లు ట్రంప్‌ అభిశంసనకు అనుకూలంగా ఉన్నారని తేల్చింది. హౌస్‌ కమిటి విచారణ ప్రారంభం కాకముందు ఫైప్‌ థర్టీ ఎయిట్‌ అనే వైబ్‌సైట్‌ నిర్వహించిన మరో అభిప్రాయ సేకరణలో 48 శాతం మంది ట్రంప్‌ను తొలగించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

తనపై డెమోక్రట్స్‌ ప్రవేశ పెట్టిన అభిశంసనను ఒక కుట్రగా అధ్యక్షుడు ట్రంప్‌ అభివర్ణిస్తున్నారు. కానీ వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్‌ నుంచి గట్టి పోటీ ఎదురు కాగలదని ఊహించిన ట్రంప్‌ ఆయనపై విచారణకు ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారని మెజారిటీ అమెరికన్లు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అమెరికన్‌ రాజకీయాలు ఇప్పుడు రసకందాయంగా మారాయి.