AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ తండ్రికి మూడో సంతానంలా పెంపుడు పైథాన్‌..పొడవు 18 అడుగులు..!

పిల్లులను, కుక్కలను, కుందేళ్లు, పావురాలను పెంచుకునే వాళ్లను మనం చూస్తుంటాం..ఇంకా ప్రేమతో కొందరు తొండలు, ఉడతలను కూడా పెంచుకుంటున్న వాళ్లను కూడా చూశాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా భారీ కొండచిలువనే తమ ఇంట్లో పెంచుకుంటున్నాడు. అంతే కాదు, అది తనకు తమ పిల్లలతో సమానమని చెబుతున్నాడు. ఇంట్లో ప్రత్యేకంగా దానికో గదిని కేటాయించి మరీ ఆలనా పాలనా చూస్తున్నాడు. అప్పుడప్పుడు దానిని అడవిలోకి షికారుకి కూడా తీసుకెళ్తాడట. ఆ పామును తాను తీసుకువచ్చినప్పుడు కేవలం […]

ఆ తండ్రికి మూడో సంతానంలా పెంపుడు పైథాన్‌..పొడవు 18 అడుగులు..!
Anil kumar poka
|

Updated on: Nov 19, 2019 | 5:21 PM

Share

పిల్లులను, కుక్కలను, కుందేళ్లు, పావురాలను పెంచుకునే వాళ్లను మనం చూస్తుంటాం..ఇంకా ప్రేమతో కొందరు తొండలు, ఉడతలను కూడా పెంచుకుంటున్న వాళ్లను కూడా చూశాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా భారీ కొండచిలువనే తమ ఇంట్లో పెంచుకుంటున్నాడు. అంతే కాదు, అది తనకు తమ పిల్లలతో సమానమని చెబుతున్నాడు. ఇంట్లో ప్రత్యేకంగా దానికో గదిని కేటాయించి మరీ ఆలనా పాలనా చూస్తున్నాడు. అప్పుడప్పుడు దానిని అడవిలోకి షికారుకి కూడా తీసుకెళ్తాడట. ఆ పామును తాను తీసుకువచ్చినప్పుడు కేవలం 8 అంగుళాలే ఉండేదని, ఇప్పుడది 18 అడుగుల పొడవు, 110 కిలోల బరువు పెరిగిందని, త్వరలోనే అది ప్రపంచ రికార్డును బద్దలు కొట్టబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ఇంగ్లాండ్‌లోని ట్యూక్స్‌బరీలో నివసిస్తున్న మార్కస్‌ హబ్స్‌ అనే 31 ఏళ్ల యువకుడు తన ఇంట్లో భారీ కొండచిలువను పెంచుతున్నాడు. మార్కస్‌కు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. అయినప్పటికీ అతను ఆ మహాసర్పాన్ని ఇంటి సభ్యుడిగా భావిస్తున్నాడు. అంతేకాదు, దానికి ముద్దుగా హేస్కియో అని పేరు కూడా పెట్టాడు. ప్రపంచంలో 18.8 అడుగుల కొండ చిలువే అతి పొడవైనదిగా రికార్డుల్లో ఉందని, ఇటీవల హేస్కియో పొడవును కొలవగా 18 అడుగులు ఉందని, త్వరలో ఇది మరింత పొడవు ఎదిగి..ఆ రికార్డును చెరిపేస్తుందని భావిస్తున్నానంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

అయితే, ముద్దుగా పెంచుకంటున్న పైథాన్‌ విషయంలో ప్రేమతో పాటుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాని చెబుతున్నాడు. తన పిల్లలను కొండచిలువ దరిదాపులకు కూడా రానివ్వనని చెబుతున్నాడు. పిల్లలకు కూడా దానిని చూపించనని అంటున్నాడు. అతి విశ్వాసంతో వదిలేసి ఊహించని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం మంచిది కాదు. అది ప్రమాదకరం కాదని భావిస్తే..నేను బాధ్యత తెలియని యజమాని కింద లెక్క’ అని అంటున్నాడు మార్కస్‌ హబ్స్‌. ఇక హేస్కియో ఆహారం కోసం కుందేళ్లు, జింక, దుప్పి పిల్లలు, పందులను పెడుతుంటానని చెప్పాడు. వీటిని స్థానిక రైతులు సరఫరా చేస్తారని చెప్పాడు.