AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Los Angeles Protest: రగులుతున్న లాస్ ఏంజెలెస్‌.. 400 మంది అరెస్ట్.. ఆ చట్టాన్ని ప్రయోగిస్తానంటూ ట్రంప్ వార్నింగ్‌‌..

లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ విధించారు.. అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్‌ అధికారుల దాడులతో మొదలై రణరంగంగా మారింది లాస్‌ ఏంజెలెస్‌.. ఈ నిరసన జ్వాలలు ఇతర నగరాలకూ విస్తరిస్తున్నాయి. భారీగా సైన్యం, మెర్లైన్లను మోహరించారు.

Los Angeles Protest: రగులుతున్న లాస్ ఏంజెలెస్‌.. 400 మంది అరెస్ట్.. ఆ చట్టాన్ని ప్రయోగిస్తానంటూ ట్రంప్ వార్నింగ్‌‌..
Los Angeles Protests
Shaik Madar Saheb
|

Updated on: Jun 12, 2025 | 11:18 AM

Share

లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ విధించారు.. అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్‌ అధికారుల దాడులతో మొదలై రణరంగంగా మారింది లాస్‌ ఏంజెలెస్‌.. ఈ నిరసన జ్వాలలు ఇతర నగరాలకూ విస్తరిస్తున్నాయి. భారీగా సైన్యం, మెర్లైన్లను మోహరించారు. నగరం అంతా సైనికులతో నిండిపోయింది.. లాస్ ఏంజెలెస్‌లో హింసాత్మక నిరసనలతో కర్ఫ్యూ విధించారు.. మేయర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆందోళన నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపుతామని ట్రంప్ స్పష్టంచేశారు. తిరుగుబాటు చట్టాన్ని ప్రయోగిస్తానని హెచ్చరించారు.ఇలాగే ఆందోళనలు కొనసాగితే నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తానని ట్రంప్‌ వార్నింగ్ ఇచ్చారు.

కాగా.. అక్రమ వలసదారుల అరెస్ట్‌లకు నిరసనగా గత ఆరు రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆస్టిన్‌లో ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగి నలుగురు అధికారులకు గాయాపడ్డారు. భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి.. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆందోళన కారులు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే అల్లర్లు చేస్తూనే ఉన్నారు. దీంతో 400 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

అక్రమ వలసదారులను డీపోర్ట్‌ చేయడమే లక్ష్యంగా అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు చేపట్టిన తనిఖీలు, చేసిన అరెస్టులతో చిన్న నిప్పురవ్వలా మొదలైన ప్రజాగ్రహం.. వారిని అణచివేయడానికి ట్రంప్‌ సర్కారు ఏకంగా నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దించడంతో పెను జ్వాలగా మారింది. కర్ఫ్యూతో లాస్‌ ఏంజెలెస్‌లో ఉద్రిక్తత రాత్రివేళ కాస్తంత తగ్గుముఖం పట్టినా ఇతర నగరాల్లో మాత్రం ఉధృతంగా కొనసాగుతోంది. శాన్‌ ఫ్రాన్సిస్కో మొదలు సియాటెల్, న్యూయార్క్, షికాగో, డెన్వర్, శాంటా అనా, ఆస్టిన్, డాలస్, బోస్టన్, వాషింగ్టన్‌ డీసీదాకా చాలా ప్రధాన నగరాల్లో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

లాస్‌ఏంజెలిస్‌లో భారీగా నేషనల్ గార్డ్స్‌ మోహరింపు..

కాగా.. లాస్‌ఏంజెలిస్‌లో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడికి భారీగా నేషనల్ గార్డ్స్‌ని, మెరైన్స్‌ని తరలించారు. ఇరాక్, సిరియాలో ఉన్న గార్డ్స్‌ కంటే ఎక్కువ మందిని ఇప్పుడు లాస్‌ఏంజెలిస్‌లో మోహరించారు. అయితే.. ఈ గార్డ్స్‌కి అరెస్టు చేసే అధికారం ఉండదు.. ఇప్పుడు వాళ్లకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో అరెస్టులకు తాత్కాలికంగా వారికి అనుమతి ఇచ్చారు. మరోవైపు.. కాలిఫోర్నియాలో డెమోక్రాటిక్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర బలగాలను తిప్పి పంపాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్