Russia vs Ukraine: ఉక్రెయిన్ దేశం విడిచి వెళ్లండి.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ వార్నింగ్..
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది రష్యా. ఇటీవల కీవ్ నగరంతో పాటు కీలక సిటీలను టార్గెట్ చేసింది. దీంతో ఉక్రెయిన్‌లో నివసిస్తున్నవారు ప్రాణాలను..

ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది రష్యా. ఇటీవల కీవ్ నగరంతో పాటు కీలక సిటీలను టార్గెట్ చేసింది. దీంతో ఉక్రెయిన్‌లో నివసిస్తున్నవారు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇటు భారత ఎంబసీ కూడా మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను ఉపయోగించుకుని ఉక్రెయిన్ దాటి వెళ్లాలని సూచించింది. ఇప్పటికే ఈనెల 19న అడ్వైజరీ జారీ చేయగా, దానికి కొనసాగింపుగా తాజాగా మరో అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడంలో ఇండియన్ ఎంబసీ మరోసారి అడ్వైజరీ జారీ చేసినట్టు తెలుస్తోంది.
మొదటి అడ్వైజరీ జారీ చేసిన సమయంలోనే ఇండియన్ ఎంబసీ ఐదు మార్గాలను సూచించింది. ఉక్రెయిన్ విడిచి వెళ్లేందుకు ఈ ఐదు మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్- హంగేరి, ఉక్రెయిన్- స్లోవేకియా సరిహద్దు ప్రాంతం, ఉక్రెయిన్- మాల్డోవా, ఉక్రెయిన్- పోలాండ్, ఉక్రెయిన్- రొమేనియా సరిహద్దుల నుంచి దేశం విడిచి వెళ్లాలని సూచించింది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఆపరేషన్ గంగా పేరుతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను ఎయిర్ లిఫ్ట్ చేసింది భారత సర్కార్. ఇప్పటి వరకు 22,500 మందిని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. అయితే 2021 జూన్ నాటికి ఉక్రెయిన్‌లోని వివిధ విద్యాసంస్థలో 18 వేల మంది అడ్మిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆపరేషన్ గంగ ద్వారా ఇప్పటికే చాలా మంది విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. అయితే ఇంకా కొంతమంతి స్టూడెంట్స్‌తో పాటు ఉపాధి కోసం వెళ్లినవారు ఉక్రెయిన్‌లో ఉన్నట్టు ఇండియన్ ఎంబసీ భావిస్తోంది. అందుకే రెండోసారి అడ్వైజరీ జారీ చేసింది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
