Drinker in plane: పెగ్ ఏస్తే అట్లుంటది మనతోని.. మద్యం మత్తులో వీరంగం..! విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్.!
టర్కీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇస్తాంబుల్ నుంచి ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయలుదేరింది. అయితే మద్యం సేవించి వచ్చిన ఓ ప్రయాణికుడు విమానంలో నానా రచ్చ చేశాడు.
టర్కీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇస్తాంబుల్ నుంచి ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయలుదేరింది. అయితే మద్యం సేవించి వచ్చిన ఓ ప్రయాణికుడు విమానంలో నానా రచ్చ చేశాడు. సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. ఒకరి వేలు కొరికాడు. అంతటితో ఆగకుండా తోటి ప్రయాణిలపై చేయి చేసుకునేంత వరకు వెళ్లాడు. అతన్ని కట్టడి చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. దీంతో చేసేదేమీ లేక జకార్తాకు వెళ్లాల్సిన విమానాన్ని మెడాన్‌లోని కౌలానామ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మద్యం మత్తులోని ప్రయాణికుడిని దింపేసి.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.