విదేశాల పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ నిబంధనలు తప్పకుండా తెలసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

|

Mar 12, 2021 | 11:32 AM

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. కోవిడ్‌ కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా కోలుకోవడం లేదు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు..

విదేశాల పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ నిబంధనలు తప్పకుండా తెలసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!
Follow us on

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. కోవిడ్‌ కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా కోలుకోవడం లేదు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో విదేశీ పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి పలు దేశాలు. దీంతో విదేశాల్లో సేదతీరేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా దుబాయ్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, మలేషియా దేశాల్లో హాలిడే ట్రిప్‌కు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఆయా దేశాల్లో క్వారంటైన్‌ నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

యూఏఈ క్వారంటైన్‌ నిబంధనలు..

యూఏఈ క్వారంటైన్‌ మార్గదర్శకాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగా ఉన్నాయి. యూఏఈ కొన్ని దేశాలను హైరిస్క్‌ దేశాల జాబితాలో ఉంచింది. ఈ ఏడాది జనవరి 17న అబుదాబిలో అమలులకి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో దాదాపు 14 రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ప్రయాణికులు అధికారులు వ్రిస్ట్ బ్యాండ్‌ను అందిస్తారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నన్ని రోజులు ఈ బ్యాండ్‌ను ధరించాల్సి ఉంటుంది. దీని ద్వారా అధికారులు సదరు ప్రయాణికుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. అలాగే ఈ క్వారెంటైన్ కేంద్రానికి వెళ్లిన ఎనిమిదో రోజుకు సదరు ప్రయాణికులకు అధికారులు మరోసారి పీసీఆర్ టెస్ట్ చేస్తారు.

అలాగే దుబాయ్‌, షార్జా వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణానికి 96 గంటల ముందు పీసీఆర్‌ టెస్ట్‌ చేసుకుని నెగెటివ్‌ రిపోర్టును పొందాల్సి ఉంటుంది. ఈ రిపోర్టును చూపించిన వారికి మాత్రమే దుబాయ్‌, షార్జాకు ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుంది. షార్జాకు వెళ్లే పర్యాటకులు, షార్జా నివాసితులు అక్కడికి చేరుకున్న తర్వాత ఎయిర్‌పోర్టులో మళ్లీ పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. వాటి ఫలితాలు వచ్చే వరకు క్వారంటైన్‌లో ఉండాలి. ఒక వేళ ఫలితాల్లో పాజిటివ్‌గా తేలితే 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. దుబాయ్‌లో కూడా దాదాపు ఇదే రకమైన మార్గదర్శకాలే అమలు అవుతున్నాయి. ఇక యూఏఈ లో క్వారంటైన్‌ రూల్స్‌ అతిక్రమించినట్లయితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుందని తెలుస్తోంది.

సింగపూర్‌లో..

సింగపూర్‌లో క్వారంటైన్‌ మార్గదర్శకాల ప్రకారం.. సింగపూర్‌కు బయలుదేరే 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగెటివ్‌ రిపోర్టు పొందాల్సి ఉంటుంది. అప్పుడు వారి ప్రయాణానికి అనుమతి ఇస్తారు. ఏడేళ్లపైబడిన పిల్లల నుంచి మొదలుకొని కోవిడ్‌ నుంచి బయటపడిన వారు కూడా ఈ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. అలాగే సింగపూర్ చేరుకున్న తర్వాత అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు మరోసారి ఆర్టీ-పీసీఆర్ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనికి అయ్యే ఖర్చు సదరు ప్రయాణికుడే భరించుకోవాలి.
అయితే సింగపూర్‌ ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఖరీదు దాదాపు రూ.12వేల వరకు ఉంటుంది. ప్రయాణికుడి ట్రావెట్ హిస్టరీని బట్టి.. అక్కడి అధికారులు స్టే హోం నోటీసును జారీ చేస్తారు.

థాయ్‌లాండ్‌లో..

అనుమతి పొందిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రయాణికులు తమ దేశానికి వస్తే వారికి 14 రోజుల క్వారంటైన్‌ రూల్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని థాయ్‌లాండ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనను చాలా మంది ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ తీసుకుని థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లయితే క్వారంటైన్‌ అవసరం ఉండదు. అయితే తాజాగా అక్కడి ఓ ప్రముఖ పత్రిక వెలువరించిన కథనం ప్రకారం.. థాయ్‌లాండ్ వెళ్లిన పర్యాటకులకు 14 రోజుల క్వారెంటైన్ తప్పనిసరి అని తెలుస్తోంది.

మలేషియాలో…

మలేషియా కోవిడ్‌ నిబంధనల ప్రకారం.. మలేషియాకు బయలుదేరిన 72 గంటల ముందు ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులు నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే మలేషియాకు వెళ్లేందుకు అర్హులు. మలేషియా చేరుకన్న తర్వాత అక్కడి అధికారులు ఎయిర్‌పోర్టులో మరోసారి కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. విదేశాల నుంచి మలేషియాకు వెళ్లిన ప్రతి ప్రయాణికుడు 7 రోజుల పాటు క్వారంటైన్‌ ఉండాల్సిందే. క్వారంటైన్‌ ఐదు రోజులు గడిచిన తర్వాత అధికారులు మరోసారి కోవిడ్‌ పరీక్షల చేసే అవకాశం ఉంది. అందులో నెగెటివ్‌ రిపోర్టు వస్తే ఆ దేశ పర్యటనకు అనుమతి ఇస్తారు.
ఇలా కరోనా మహమ్మారి కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా అన్ని నిబంధనలు తెలుసుకుని వెళితే బాగుంటుంది లేకపోతే మీ సమయం వృధా కావడం ఖాయం.

ఇవీ చదవండి :

గంపెడు టమాటల కోసం రెండు గ్రూపుల ఘర్షణ.. 20 మంది మృతి.. రంగంలోకి దిగిన పోలీసులు.. కఠినమైన ఆంక్షలు

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన కుమారుడే తల్లిదండ్రులపైన కేసు పెట్టాడు.. కారణం ఏమిటో తెలిస్తే..

H-1B Vias: గుడ్‌న్యూస్‌.. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది..?

Lockdown: మళ్లీ లాక్‌డౌన్‌.. కీలక ఆదేశాలు జారీ చేసిన అధికారులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు