Lahore university proposal: యూనివర్సిటీలో ఏంటి ఈ పిచ్చి పనులు… ఇరువురిపై బహిష్కరణ వేటు

చదువుల నిలయమైన యూనివర్సిటీలో లవ్ ప్రపోజ్‌ చేసుకోవడంపై యాజమాన్యం సీరియస్ అయ్యింది. అందులోనూ అందరి ముందే హగ్గులిస్తూ ప్రేమలో...

Lahore university proposal: యూనివర్సిటీలో ఏంటి ఈ పిచ్చి పనులు... ఇరువురిపై బహిష్కరణ వేటు
Lahore University Proposal

Updated on: Mar 14, 2021 | 5:52 PM

చదువుల నిలయమైన యూనివర్సిటీలో లవ్ ప్రపోజ్‌ చేసుకోవడంపై యాజమాన్యం సీరియస్ అయ్యింది. అందులోనూ అందరి ముందే హగ్గులిస్తూ ప్రేమలో తూలి తేలిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అరుదైన ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్‌ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. ఇద్దరు ప్రేమ పక్షులు వారి మనసులోని భావాలను ఒకరికొకరు చెప్పుకునేందుకు క్యాంపస్‌నే ఎంచుకున్నారు. అందరూ చూస్తుండగానే యువతి మోకాలిపై కూర్చుని మనసు పడ్డ వ్యక్తికి పువ్వులు ఇస్తూ ప్రపోజ్‌ చేసింది. దీంతో అతడు ఆమెను అక్కున చేర్చుకుని కౌగిలితంల్లో బంధించాడు. దీన్నంతటినీ అక్కడున్న విద్యార్థులు ఫోన్లలో చిత్రీకరించారు. ఈ క్యూట్ లవ్ ప్రపోజల్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూనివర్సిటీ అధికారులు ఆ ఇద్దరినీ తమముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను వారు బేఖాతరు చేశారు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కింద వారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, వారు యూనివర్సిటీకి సంబంధించిన ఏ క్యాంపస్‌లోనూ అడుగు పెట్టేందుకు వీల్లేదని నిషేధం విధించారు. ఈ క్రమంలో వారిద్దరినీ డిబార్‌ చేసినట్లు యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అధికారులు తీసుకున్న నిర్ణయం మంచిదేనని కొందరు సపోర్ట్‌ చేస్తే.. వాళ్లు ప్రేమించుకుంటే మీకేంటంటా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు.

Also Read: Tadipatri Municipality: ఊరి మంచి కోసం జగన్‌ను కలిసేందుకు సిద్దం.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hindupur municipality: బాలయ్యకు చెక్.. హిందూపురంలో వైసీపీ ఏకపక్ష విజయం