Prime Minister of Pakistan: సోషల్ మీడియాలో వీడియో.. మరింత దిగజారుతున్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిష్ఠ..

|

Mar 10, 2021 | 6:07 PM

Prime Minister of Pakistan: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు కుదేలయ్యాయి. ఎన్నో దేశాలు ఆర్థికంగా కునారిల్లి..

Prime Minister of Pakistan: సోషల్ మీడియాలో వీడియో.. మరింత దిగజారుతున్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిష్ఠ..
Follow us on

Prime Minister of Pakistan: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు కుదేలయ్యాయి. ఎన్నో దేశాలు ఆర్థికంగా కునారిల్లి దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ముఖ్యంగా మన దాయాది దేశమైన పాకిస్తాన్ పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. పెరిగిన ధరలతో అక్రడి ప్రజలు అల్లాడిపోతున్నారు. కరువు ఏర్పడే పరిస్థితి నెలకొంది. దాంతో ఆ దేశ ప్రభుత్వంపై ప్రజలల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ ప్రజలు భగ్గమంటున్నారు. ఛాన్స్ దొరికితే చాలు ఏదో రకంగా ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఇమ్రాన్‌ ఖాన్‌పై సెటైర్లు వేస్తూ ఓ వీడియోను రూపొందించారు పాక్ ప్రజలు. ఇప్పుడా వీడియో పెను సంచలనంగా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ సందర్భంలో ‘ముందుగా మీరు కంగారు పడొద్దు’ అంటూ కామెంట్ చేశారు. దాన్ని లిరిక్స్‌గా తీసుకుని.. దేశంలో పెరుగుతున్న పేదరికం, విద్య, వైద్యం అంశాలను ప్రధానంగా చేస్తూ రీమిక్స్ పాటను రూపొందించారు. ‘ముందుగా మీరు కంగారు పడొద్దు.. ఆహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏమీ లేకపోయినా.. ఆకలితో చావాలి తప్ప కంగారు పడొద్దు’ అంటూ ఇమ్రాన్ ఖాన్ పాలనను తీవ్రంగా నిరసిస్తూ సెటైరికల్ లిరిక్స్‌తో పాటను కంపోజ్ చేశారు. అయితే, ఈ వీడియోను పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ మ్యుజీషియన్ సాద అలావీ కంపోజ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో కోస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన పాక్ ప్రజలు ఇమ్రాన్‌ ఖాన్‌పై కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితమే పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్ష నెగ్గారు. అయితే పార్లమెంట్‌లో ఆయనకు బలమున్నప్పటికీ.. ప్రజల్లో ఏమాత్రం బలం లేదు. ఇటీవల ఇస్లామాబాద్‌ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నిలబెట్టిన నేత ఓడిపోవడమే.. ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇమ్రాన్ ఖాన్ ఏదో చేస్తాడని ఎన్నుకుంటే ప్రజల జీవితాలు మరింత ధీన స్థితికి చేరేలా పరిపాలిస్తున్నారని పాక్ ప్రజలు భగ్గుమంటున్నారు. అయితే ఈ సెటైరికల్ వీడియో ఇమ్రాన్ ఖాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేయడమే కాకుండా, ఆయన ప్రతిష్ఠను మరింత దిగజారుస్తోందని టాక్ వినిపిస్తోంది.

Twitter Video:

Also read:

కిసాన్ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంక్ ఇస్తోంది.. వడ్డీ రేటు ఎంత..! సులభంగా ఎలా తీసుకోవాలో ఇక్కడ చదవండి..!

Council Polls: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరం.. మండళ్ళలో నెమ్మదిగా మారుతున్న సమీకరణాలు