Arati Prabhakar: అమెరికాలో భారతీయ మహిళకు కీలక బాధ్యతలు.. బైడెన్ సైన్స్ కన్సల్టెంట్‌గా ఆర్తి ప్రభాకర్..

|

Jun 23, 2022 | 6:38 AM

భారతీయ అమెరికన్, భౌతిక శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఆర్తీ ప్రభాకర్‌ ప్రెసిడెంట్‌ ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ పదవికి ఎంపికయ్యారు.

Arati Prabhakar: అమెరికాలో భారతీయ మహిళకు కీలక బాధ్యతలు.. బైడెన్ సైన్స్ కన్సల్టెంట్‌గా ఆర్తి ప్రభాకర్..
Arati Prabhakar
Follow us on

Arati Prabhakar: అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలువురు ఇండో-అమెరికన్లు బైడెన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ప్రముఖురాలికి వైట్‌హౌస్‌ కార్యవర్గంలో చోటు దక్కింది. భారతీయ అమెరికన్, భౌతిక శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఆర్తీ ప్రభాకర్‌ ప్రెసిడెంట్‌ ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ పదవికి ఎంపికయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన సైన్స్ (Science Advisor) సలహాదారుగా.. ఆర్తి ప్రభాకర్‌ను నియమించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఇప్పటి దాకా ఈ పదవిలో ఉన్న ఎరిక్‌ ల్యాండర్‌ రాజీనామా చేయడంతో ఆరతీ ప్రభాకర్‌ను అధ్యక్షుడు బైడెన్‌ నామినేట్‌ చేశారు. ఈ నామినేషన్‌ చారిత్రకమైనదని వైట్‌హౌస్‌ తెలిపింది, ఓఎస్‌టీపి (OSTP) కీ సెనేట్ ధృవీకరించిన డైరెక్టర్‌గా నామినేట్ చేసిన తొలి మహిళ అని ఆర్తీ ప్రభాకర్‌ అని ప్రకటించింది. అదే విధంగా బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పని చేస్తున్న మూడో ఏసియన్‌ అమెరికన్‌ కూడా ఆరతీయే అంటున్నారు.. ఆరతీ ప్రభాకర్‌ సమర్ధవంతురాలైన గొప్ప భౌతిక శాస్త్రవేత్త అని అభివర్ణించారు జో బైడెన్‌.. భారతీయులు కష్టతరమైన సవాళ్లను పరిష్కరించి, అసాధ్యాలను సుసాధ్యం చేస్తారని ప్రశంసించారు.

ఆర్తి ప్రభాకర్ ఫిబ్రవరి 2, 1959న భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జన్మించారు. ఆర్తీ ప్రభాకర్‌ మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీ నుంచి ఆమె ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్న తొలి మహిళ ఆర్తీ ప్రభాకర్‌.. ఎన్నో కంపెనీలు, యూనివర్సిటీలు, ల్యాబ్‌లు, ఎన్‌జీవోతో కలసి పని చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా పనిచేశారు. దీంతోపాటు స్వచ్ఛంద సంస్థ యాక్చుయేట్ (Arati Prabhakar – Actuate Innovation) వ్యవస్థాపకురాలిగా కూడా ఆర్తి ప్రభాకర్ సేవలందిస్తున్నారు.

సైన్స్ కన్సల్టెంట్ విధులు ఇవే..

ఇవి కూడా చదవండి

సైన్స్ ఎజెండాను నెరవేర్చడంలో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడికి సహాయం చేయడం సైన్స్ సలహాదారు ప్రధాన విధి. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, అంటువ్యాధుల నుంచి రక్షించడం, అవగాహన కల్పించడం, వాతావరణ మార్పులను పరిష్కరించడానికి పరిశోధనలు చేయడం. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాల్లో దేశం అగ్రగామిగా ఉండేలా చూసేందుకు సైన్స్ కన్సట్టెంట్‌లు ప్రధానంగా పనిచేస్తారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..