AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్ ప్రధాని షింజో అబె రాజీనామా

అనారోగ్యం కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్‌ ప్రధాని షింజో అబె శుక్రవారం ప్రకటించారు. తాను కొంతకాలంగా పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

జపాన్ ప్రధాని షింజో అబె రాజీనామా
Balu
|

Updated on: Aug 28, 2020 | 4:27 PM

Share

అనారోగ్యం కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్‌ ప్రధాని షింజో అబె శుక్రవారం ప్రకటించారు. తాను కొంతకాలంగా పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసంతో ప్రజలను పాలించే స్థితిలో లేను. అందుకే ఇకపై ఆ పదవిలో కొనసాగకూడదని అనుకుంటున్నాను. కరోనా వైరస్‌ క్లిష్టకాలం, పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే, ఏడాది పాటు పదవీకాలం మిగిలుండగానే.. రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ ముందుకు వంగి ప్రజలను అభ్యర్థించారు. జపాన్‌ చరిత్రలో అత్యంత ఎక్కువకాలం పాలించిన ప్రధానిగా అబె ఖ్యాతి గడించి షింజో అబె తన పదవి నుంచి స్వయంగా వైదొలిగారు.

కాగా, అబె ప్రాతినిధ్యం వహిస్తోన్న లిబరల్‌ డెమోక్రటిక్ పార్టీని అత్యవసరంగా సమావేశపర్చి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. అబె నిర్ణయాన్ని అస్సలు ఊహించలేదని, ఆయన రాజీనామా ఆశ్చర్యపర్చిందని సీనియర్ నేత టొమావి ఇనడా తెలిపారు. అయితే, ఆ పదవికి తదుపరి వారసుడు ఖాయమయ్యే వరకు అబె బాధ్యతలు కొనసాగించనున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌కు తరువాతి ప్రధాని ఎవరని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.

జపాన్‌కు యంగెస్ట్ ప్రధానమంత్రిగా పలు సంస్కరణలు అమలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. తొలిసారిగా ఆయన 2006 జులై 14వ తేదీన ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అప్పటికి ఆయన వయస్సు 52 సంవత్సరాలే. అప్పటి నుంచి ఆయనే ప్రధానిగా కొనసాగుతున్నారు. వరుసగా మూడుసార్లు ఆ పదవికి ఎన్నికయ్యారు. 2012 డిసెంబర్ 26వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించింది. దీనితో ఆయన రెండోసారి ప్రధానమంత్రి పదవి పగ్గాలను చేపట్టారు. 2014 డిసెంబర్ నాటి ఎన్నికల్లో ఆయన మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. అనంతరం ఉత్తరకొరియా సంక్షోభం నేపథ్యంలో మరోసారి 2017 అక్టోబర్‌లో మరోసారి స్నాప్ ఎలక్షన్‌ను నిర్వహించారు. ఆ ఎన్నికల్లోనూ ఆయన ఘన విజయాన్ని అందుకున్నారు. నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు అబె. తాజాగా, ఆయన ఆరోగ్యం క్షీణించడం వల్ల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.