భారత్‌లో ఆన్‌లైన్‌ తరగతులకు సౌకర్యాల్లేవ్ః యునిసెఫ్

కరోనా వైరస్ విద్యార్ధుల భవిష్యత్తును ప్రశ్నార్ధకరంగా మార్చేసింది. ఒక వైపు స్కూళ్లు, విద్యాసంస్థలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తుంటే..

  • Ravi Kiran
  • Publish Date - 4:29 pm, Fri, 28 August 20
భారత్‌లో ఆన్‌లైన్‌ తరగతులకు సౌకర్యాల్లేవ్ః యునిసెఫ్

UNICEF Online Classes Report: కరోనా వైరస్ విద్యార్ధుల భవిష్యత్తును ప్రశ్నార్ధకరంగా మార్చేసింది. ఒక వైపు స్కూళ్లు, విద్యాసంస్థలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తుంటే.. మరోవైపు పలు పాఠశాలల యాజమాన్యాలు, యూనివర్సిటీలు విద్యార్ధులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే భారత్‌లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు అనువైన సదుపాయాలు, సౌకర్యాలు లేవని యూఎన్ఓ అనుసంధ సంస్థ యునిసెఫ్ తాజా నివేదికలో పేర్కొంది. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

కేవలం 24 శాతం ఇళ్లలోనే ఇంటర్నెట్ సౌకర్యం ఉందని తెలిపింది. కొంతమందికి అయితే స్మార్ట్ ఫోన్లు ఉన్నా కనెక్టివిటీ ఫెసిలిటీ తగినంతగా లేదని.. దీని వల్ల చాలామంది విద్యార్ధులు ఆన్లైన్ చదువులకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించింది. చాలా మంది అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు స్మార్ట్‌ఫోన్‌లు సులువుగా అందుబాటులో ఉండవని, ఒకవేళ ఉన్నా కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉందని, నాణ్యమైన విద్య స్థానిక భాషల్లో అందుబాటులో ఉండదని నివేదికలో పేర్కొంది. “భారతదేశంలో మహమ్మారి కారణంగా 1.5 మిలియన్ (15 లక్షలకు పైగా) పాఠశాలలు మూసివేయబడ్డాయి, దీని వల్ల ప్రీ-ప్రైమరీ నుండి సెకండరీ స్థాయి వరకు 286 మిలియన్ల (28.6 కోట్ల) పిల్లలపై ప్రభావం పడింది ”అని నివేదిక తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 46.3 కోట్ల మంది విద్యార్ధులకు ఇంటర్నెట్ అంటే ఏమిటో తెలియదంది.