Japan Population: ఆ దేశంలో స్టూడెంట్స్ లేని స్కూల్స్.. ఏటా 450 పాఠశాలలు మూసివేత.. రీజన్ ఏమిటంటే

|

Apr 20, 2023 | 11:09 AM

విద్యార్థుల కొరత కారణంగా జపాన్‌లో ఏటా దాదాపు 450 పాఠశాలలకు తాళాలు పడుతున్నాయని.. ఆ స్కూల్స్ అన్నీ చరిత్రగా నిలిచిపోతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది.  2002 నుంచి 2020 వరకు దాదాపు 9000 పాఠశాలలు మూతపడ్డాయి. దూరప్రాంత పాఠశాలల్లో కొత్త పిల్లలు చేరకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

Japan Population: ఆ దేశంలో స్టూడెంట్స్ లేని స్కూల్స్.. ఏటా 450 పాఠశాలలు మూసివేత.. రీజన్ ఏమిటంటే
Japan Population
Follow us on

పెరుగుతున్న జనాభాతో భారతదేశంలో ఆందోళన మొదలవ్వగా.. జపాన్ వంటి దేశం జననాల రేటు వేగంగా తగ్గడం వల్ల ఇబ్బంది పడుతోంది. పిల్లలను కనాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. జనాభా పరిరక్షణ కోసం రకరకాల వాగ్దానాలను ఇస్తోంది. ఎన్ని పథకాలు ప్రకటించినా జననాల రేటు పెరగడం లేదు. స్కూల్స్ లో స్టూడెంట్స్ తక్కువ అయ్యారు. విద్యార్థులు అందుబాటులో లేకపోవడంతో వేలాది పాఠశాలలు కూడా మూతపడ్డాయి.

మీడియా నివేదికల ప్రకారం.. ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లోని మారుమూల ప్రాంతమైన టైన్ ఈ గ్రామంలో ఇక్కడి జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే 18 ఏళ్ల లోపు వారే. ఒక పాఠశాల ఉంది. ఈ స్కూల్ లో తక్కువమంది స్టూడెంట్స్ చదువుకునేవారు.. అయితే ఇప్పుడు అసలు ఎవరూ పిల్లల చదువు కోసం అడ్మిషన్ తీసుకోవడానికి రాకపోవడంతో ఈ స్కూల్ మూత పడే స్టేజ్ కు చేరుకుంది. ఈ స్కూల్ లో చివరి ఇద్దరు విద్యార్థులు అయోయ్ హోషి , ఈటా సాటో. వీరిద్దరూ అక్కచెల్లెలు. వయసు 15 ఏళ్లు. ఇప్పుడు వారి చదువులు కూడా పూర్తి కానున్నాయి. అనంతరం ఈ స్కూల్ కు తాళం వేయనున్నారు.  పాఠశాలకు తాళం వేలాడుతూ ఉంటుంది.

తాను చదువుకున్న స్కూల్ మూసివేయనున్నట్లు ప్రిన్సిపాల్ చెప్పినప్పుడు తాను చాలా బాధపడినట్లు యుమోతి జూనియర్ హైస్కూల్‌లో చదువుకున్న విద్యార్థి అవోయి హోషి చెప్పారు. ఈ స్కూల్ అతి పురాతనమైంది.. ఇపుడు మూతపడడం తనను బాధిస్తుందని పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. స్కూల్ తో తమకు ఉన్న బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

గతేడాది జపాన్‌లో 8 లక్షల మంది పిల్లల జననం 
విద్యార్థుల కొరత కారణంగా జపాన్‌లో ఏటా దాదాపు 450 పాఠశాలలకు తాళాలు పడుతున్నాయని.. ఆ స్కూల్స్ అన్నీ చరిత్రగా నిలిచిపోతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది.  2002 నుంచి 2020 వరకు దాదాపు 9000 పాఠశాలలు మూతపడ్డాయి. దూరప్రాంత పాఠశాలల్లో కొత్త పిల్లలు చేరకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గత ఏడాది అంటే 2022లో కేవలం 8 లక్షల మంది పిల్లలు మాత్రమే జన్మించారంటే జపాన్ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకీ పిల్లల జననాల రేటు పడిపోతోంది. పిల్లల పెంపకంపై ఖర్చు పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. పిల్లలను కనడానికి ప్రజలు వెనుకాడడానికి ఇదే కారణం. దక్షిణ కొరియా, చైనాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..