AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nobel Prize: నొబెల్‌ పురస్కారానికి ట్రంప్‌ పేరుని ప్రతిపాదించిన ఇజ్రాయెల్‌… ఇదివరకే ట్రంప్‌ పేరు ప్రతిపాదించిన పాక్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు నొబెల్‌ పురస్కారం అందించాలనే దేశాల జాబితా పెరుగుతోంది. ప్రతీకార సుంకాలతో ప్రపంచదేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్‌ కొందరికి శాంతిదూతలా కనిపిస్తున్నారు. ప్రపంచశాంతికి పాటుపడుతున్నందుకు ఆయనకు నోబెల్‌ పురస్కారం దక్కాలని కోరుకుంటున్నారు. తనకు నోబెల్ కావాలి అంటూ డిమాండ్ చేస్తున్న ట్రంప్‌కు మొన్న పాకిస్తాన్‌, తాజాగా ఇజ్రాయెల్‌...

Nobel Prize: నొబెల్‌ పురస్కారానికి ట్రంప్‌ పేరుని ప్రతిపాదించిన ఇజ్రాయెల్‌... ఇదివరకే ట్రంప్‌ పేరు ప్రతిపాదించిన పాక్‌
Netanyahu Nominated Trump F
K Sammaiah
|

Updated on: Jul 08, 2025 | 11:32 AM

Share

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు నొబెల్‌ పురస్కారం అందించాలనే దేశాల జాబితా పెరుగుతోంది. ప్రతీకార సుంకాలతో ప్రపంచదేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్‌ కొందరికి శాంతిదూతలా కనిపిస్తున్నారు. ప్రపంచశాంతికి పాటుపడుతున్నందుకు ఆయనకు నోబెల్‌ పురస్కారం దక్కాలని కోరుకుంటున్నారు. తనకు నోబెల్ కావాలి అంటూ డిమాండ్ చేస్తున్న ట్రంప్‌కు మొన్న పాకిస్తాన్‌, తాజాగా ఇజ్రాయెల్‌ వంత పాడుతున్నాయి. ఉగ్రవాదం, యుద్దోన్మాదంతో ఊగిపోయే ఆ రెండుదేశాలు శాంతికపోతమంటూ ట్రంప్‌ని కీర్తిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది ఇజ్రాయెల్. ట్రంప్​ పేరుని నామినేట్ చేస్తూ నోబెల్ బహుమతి కమిటీకి లేఖ పంపినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. వైట్‌హౌస్‌లో జరిగిన విందు కార్యక్రమంలో ట్రంప్‌కి ఈ విషయం చెప్పిన నెతన్యాహు… నోబెల్‌ కమిటీకి రాసిన లేఖ కాఫీని స్వయంగా అందజేశారు.

ఇజ్రాయెల్ ప్రధాని ఇచ్చిన నామినేషన్​ లేఖతో ట్రంప్‌ ఫుల్‌ ఖుషీ. తన పేరును నామినేట్​ చేసినందుకు నెతన్యాహుకు థాంక్స్‌ చెప్పారు అమెరికా అధ్యక్షుడు. ఇటీవల పాకిస్తాన్​కూడా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరుని ప్రతిపాదించింది. భారత్​-పాక్ మధ్య ఏర్పడిన సంఘర్షణలను నివారించి, గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించిన ట్రంప్​నోబెల్‌ పురస్కారానికి అన్నివిధాలా అర్హుడని ఆకాశానికెత్తేసింది పాకిస్తాన్‌. తనని నోబెల్‌ శాంతి బహుమతికి ప్రతిపాదించిన తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసీమ్‌ మునీర్‌కి విందు ఇచ్చారు ట్రంప్.

డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిపై మక్కువ ఇప్పటికిప్పుడు పుట్టిందికాదు . ఫస్ట్ టర్మ్‌లోనూ నోబెల్ బహుమతికి తాను అర్హుడ్ని అని తనకు తాను సెల్ఫ్‌సర్టిఫికెట్‌ ఇచ్చున్నాడు. ఇప్పుడు రెండో టర్మ్ ఆ కోరిక మరింత బలబడింది. పైగా తానెందుకు అర్హుడినో నాలుగైదు ఉదాహరణలు చెప్పుకొస్తున్నాడు ట్రంప్.

కాంగో- రువాండా మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటుచేశానంటున్నారు ట్రంప్ . హింసాత్మక రక్తపాతానికి, పౌరుల మరణాలకు దారితీసిన ఇతర యుద్ధాల కన్నా పెద్దదని..అలాంటి యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ తనదే అన్నది ట్రంప్ మాట. సెర్బియా-కొసావో మధ్య యుద్ధాన్ని కూడా ఆపానని..అయినా నోబెల్ వాళ్లు గుర్తించడంలేదంటూ వాపోతున్నారు. అంతేకాదు అన్నింటికన్నా ముఖ్యమైన ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశానని..అయినా ఎందుకు గుర్తించడంలేదన్నది ట్రంప్ వాదన. ఆవేదన

ట్రంప్ ఆక్రోశమంతా బరాక్ ఒబామాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినందుకేనంటారు ఆయన వ్యతిరేకులు. బరాక్ ఒబామాకు 2009లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా అంతర్జాతీయ దౌత్యాన్ని బలోపేతం చేసినందుకు ఈ గౌరవం లభించింది. అణు ఆయుధాల రహిత ప్రపంచం కోసం ఆయన చేసిన కృషి ముఖ్య కారణం. అంతర్జాతీయ సమస్యలపై సహకారాన్ని ప్రోత్సహించినందుకు గుర్తింపు పొందారు. అయితే తాను కూడా ప్రపంచశాంతికోసం పోరాడుతున్నానన్నది ట్రంప్ వెర్షన్.

ప్రస్తుతం 2026 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును పాకిస్తాన్ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ట్రంప్‌ వ్యూహాత్మక దూరదృష్టితో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారని పేర్కొంది. అయితే ఇండియా పాక్ మధ్య ట్రంప్ జోక్యం లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ట్రంప్ కూడా ఒప్పుకున్నాడు. కేవలం పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతోనే భారత్ సీజ్‌ఫైర్‌కు ఒప్పుకుంది. ఇది అంతర్జాతీయ సమాజానికి చాలా స్పష్టంగా అర్ధమైంది. అయినా ట్రంప్ ఇండియా పాక్ యుద్ధాన్ని ఆపానంటూ పదే పదే చెబుతుండడం..కేవలం నోబెల్ బహుమతి కోసమేనని తెలుస్తోంది. మరి చూడాలి ట్రంప్ కల సెకండ్ టర్మ్‌లో నెరవేరుతుందా..లేదా అన్నది.