Avian Flu: మనవాళిపై పగబట్టిన వైరస్‌లు.. ఆదేశంలో వేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. 5వేల కొంగలు మృతి.. 5 లక్షల కోళ్లు చంపివేత..

|

Dec 29, 2021 | 4:12 PM

Israel in Avian Flu: మనవాళిపై , ప్రకృతిపై వైరస్ లు పగబట్టినట్లు ఉన్నాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది మొదలు.. ప్రపంచంలో రోజుకో కొత్త వైరస్ తో పాటు పాత వైరస్ లు..

Avian Flu: మనవాళిపై పగబట్టిన వైరస్‌లు.. ఆదేశంలో వేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. 5వేల కొంగలు మృతి.. 5 లక్షల కోళ్లు చంపివేత..
Israel In Avian Flu
Follow us on

Israel in Avian Flu: మనవాళిపై , ప్రకృతిపై వైరస్ లు పగబట్టినట్లు ఉన్నాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది మొదలు.. ప్రపంచంలో రోజుకో కొత్త వైరస్ తో పాటు పాత వైరస్ లు కూడా విజృంభిస్తూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్‌లో ఏవియన్ ఫ్లూ (బర్ద్ ఫ్లూ) కల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఆ దేశంలో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే హులా నేచర్ రిజర్వ్‌లో ఐదు వేలకు పైగా వలస కొంగ పక్షులు చనిపోయాయి. ఇదే విషయంపై ఆదేశ పర్యావరణ శాఖ మంత్రి తమర్ జాండ్‌బర్గ్ స్పందిస్తూ.. ఇలాంటి సంఘటన ఇజ్రాయెల్ చరిత్రలో మొదటిసారని.. వన్యప్రాణులు ఒక్కసారిగా ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. అంతేకాదు మరోవైపు స్థానిక పౌల్టీ రైతులు ఐదు లక్షలకు పైగా కోళ్లను బలవంతంగా చంపేస్తున్నారు. అయితే ఈ బర్ద్  ఫ్ల్యూ మనుషుల్లో వ్యాప్తి చెందుతుందన్న సమాచారం ఇప్పటివరకు అందలేదని కానీ ప్రమాదాన్నీ నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తన జాతీయ భద్రతా సలహాదారు సహా ఇతర నిపుణులతో సమావేశమయ్యారు. ఈ  సమావేశంలో ఏవియన్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అదే సమయంలో, వ్యాధి సోకిన పక్షులతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు నివారణ చికిత్స అందించాలని సూచించారు. అయితే పక్షుల నుంచి మనుషులకు ఈ వైరస్ సంక్రమించడం చాలా అరుదని చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం..  2003 నుండి ప్రపంచవ్యాప్తంగా ఏవియన్ ఫ్లూ వైరస్ కారణంగా 456 మంది మరణించారు. దీంతో ఇజ్రాయెల్ ఇప్పుడు వేగంగా బర్ద్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అడుగులు వేస్తోంది.

ఇతర వన్యప్రాణులకు సోకకుండా హులా సరస్సులోని కొంగల కళేబరాలను తొలగిస్తున్నారు. హులా నేచర్ రిజర్వ్‌ కి  శీతాకాలంలో యూరప్ నుండి వేలాది కొంగలు వలస వస్తాయి. ఈ దృశ్యం పక్షుల ప్రేమికులకు అమిత ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణంగా..  హులా సరస్సు పరిసర ప్రాంతాల్లో పర్యాటకులకు అనుమతిని నిలిపివేశారు.

అయితే ఈ బర్డ్ ఫ్లూ మరింతగా వ్యాప్తిస్తే.. దేశంలోని అన్ని పక్షులను చంపవలసి ఉంటుంది.. కనుక ఈ వైరస్ వ్యాప్తిని త్వరగా నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. ఒకవేళ పక్షులలో వైరస్ లక్షణాలు కనిపిస్తే.. వేంటనే వాటిని చంపేయాలని సూచిస్తున్నారు. మిగిలిన పక్షులకు వ్యాధి సోకకుండా రక్షించడమే  ప్రధాన లక్ష్యంగా.. తగిన నిర్ణయాలను తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మోషవ్ మార్గిలియట్‌లో అర మిలియన్లకు పైగా గుడ్లు పెట్టే కోళ్లను చంపినట్లు ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆదేశంలో కోడి గుడ్ల కొరతకు దారితీయవచ్చు అని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: తాబేలు కారుపై జోరుగా షికారు .. రేసు కోసం ప్రాక్టీస్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్..