ఇజ్రాయిల్- హమాస్ వార్ లెబనాన్‌కి విస్తరిస్తోంది. హమాస్ దాడి చేసే అవకాశం ఉండడంతో లెబనాన్ బోర్డర్‌లో ఇజ్రాయిల్ అలెర్ట్ అవుతోంది. ఇజ్రాయెల్ దళాలు హమాస్ డిప్యూటీ లీడర్ సలేహ్ అరౌరిని హతమార్చిన తర్వాత ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ దాడి చేసే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. అలాగే.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఉత్తర సరిహద్దులో తన దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో స్థానిక అధికారి హుస్సేన్ యాజ్బెక్‌తో సహా కనీసం తొమ్మిది మంది హెజ్‌బొల్లా సభ్యులు మరణించారు. హమాస్ సంస్థను మట్టుపెట్టడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఇజ్రాయెల్.. లెబనాన్ రాజధాని బీరుట్‌లో డ్రోన్ దాడి ద్వారా అరౌరీని హతమార్చింది. అరౌరీని ఇజ్రాయెల్ డ్రోన్ మట్టుపెట్టడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడి గురించి మిత్రదేశమైన అమెరికాతోనూ ముందుగా పంచుకోలేదు. అటు.. తమ దాడుల్లోనే అరౌరీ మృతి చెందాడని ఇంతవరకు ఇజ్రాయెల్ కూడా ప్రకటించుకోలేదు. కానీ.. హమాస్, హెజ్‌బొల్లా, లెబనాన్ భద్రతా దళాలు మాత్రం ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. ఇక.. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉండడంతో తమ పౌరులను పలు దేశాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే.. వెంటనే.. లెబనాన్‌ను వీడాలని స్పష్టం చేశాయి.
ఇజ్రాయెల్- హమాస్ వివాదం ప్రాంతీయ సంఘర్షణగా పెరుగుతోందన్న నేపథ్యంలో లెబనాన్ హెజ్‌బొల్లా అధిపతి స్పందించారు. తాము నిశ్శబ్దంగా ఉండలేమని హెచ్చరించారు. ఒకవేళ.. యుద్ధాన్ని గాజా నుండి లెబనాన్ వరకు విస్తరించాలని ఇజ్రాయెల్ ఎంచుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. అరౌరీ మృతికి బదులు తీర్చుకుంటామని హెజ్‌బొల్లా ప్రకటించింది. మరోవైపు.. మిగిలిన బందీలు, కాల్పుల విరమణ కోసం జరుగుతోన్న చర్చలను హమాస్ నిలిపివేసింది. ఇప్పటికీ.. హమాస్ చెరలో 129 మంది బందీలుగా ఉన్నారు. ఇక.. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 22,000 దాటింది.
According to the IDF, Unit 669 of the Israeli Air Force continues to operate deep within the Gaza Strip and are present at every strategic location with the ground forces. The unit’s soldiers, together with the soldiers of Unit 5515 and the IAF’s Helicopter Rescue Squadron, have… pic.twitter.com/7bD8dJHsdT
— Israel War Room (@IsraelWarRoom) January 4, 2024
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..