Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు స్వల్ప ఊరట.. ఇస్లామాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు..

|

Aug 22, 2022 | 4:38 PM

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ వారెంట్ జారీచేసిన నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆగష్టు 25వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని కీలక ఆదేశాలు జారిచేసింది.

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు స్వల్ప ఊరట.. ఇస్లామాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు..
Ex Pakistan Pm Imran Khan
Follow us on

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ వారెంట్ జారీచేసిన నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆగష్టు 25వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని కీలక ఆదేశాలు జారిచేసింది. అయితే ఆగష్టు 25వ తేదీన సంబంధిత ఉగ్రవాద నిరోధక కోర్టు ముందు ఇమ్రాన్ ఖాన్ హాజరుకావాలని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం ఇమ్రాన్ ఖాన్ తరపు న్యాయవాదులు బాబర్ అవాన్ దాఖలుచేసిన వ్యాజ్యంపై జస్టిస్ మొహ్సిన్ అక్తర్ కయానీ విచారించారు.

రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించినందుకే అధికార పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్ మెంట్ (పీడీఎం) లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించిందని ఇమ్రాన్ ఖాన్ తరపు న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తరపు న్యాయవాదులు వాదించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఇటీవల నమోదుచేసిన FIR రాజక్రీయ ప్రేరేపితమైనదని, అనుమానాలు, ఊహగానాల ఆధారంగానే కేసు నమోదుచేశారని, ఎటువంటి ఆధారాలు లేవని.. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఇమ్రాన్ ఖాన్ సాక్ష్యాదారాలను తారుమారు చేసే అవకాశం లేదని న్యాయవాదులు వాదించారు. ఇమ్రాన్ ఖాన్ తో ప్రభుత్వ ప్రభుత్వ వాదనాలు విన్న న్యాయమూర్తి.. మూడు రోజుల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..