Rishi Sunak – UK PM Race: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల బ్యాలెట్ పోల్‌లో వరుసగా నాలుగు రౌండ్లలోనూ రిషి సునాక్ ముందంజలో నిలిచారు. దీంతో రేసులో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉన్నారు. నాలుగో రౌండ్లో 118 ఓట్లతో రిషి సునాక్ అగ్రస్థానంలో నిలవగా.. బిజినెస్ మినిస్టర్ పెన్నీ మోర్డాంట్‌కు 92, విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్‌కు 86 ఓట్లు వచ్చాయి. తదుపరి రౌండ్‌లో సునక్, పెన్నీ మోర్డాంట్, లిజ్ ట్రస్‌ల మధ్య పోటీ జరుగనుంది. ఆ తర్వాత ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగలనున్నారు. దీని తర్వాత టోరీ పార్టీ సభ్యత్వం ఉన్న వారు చెందిన ఓటు వేయనున్నారు. సుమారు 1,60,000 మంది అర్హులైన కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్ 5న ప్రధానిని ప్రకటించనున్నారు.
రిషి సునాక్ గురించి ఆసక్తికర విషయాలు..
రాజకీయ ఆరంగ్రేటం..
అక్షతాతో పరిచయం.. వివాహం
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో రిషి సునాక్ కు పరిచయం
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న సమయంలో ఉషకు రిషితో పరిచయం ఏర్పడింది
అనంతరం ఈ పరిచయం ప్రేమగా మారింది
నాలుగేళ్ల తర్వాత బెంగళూరులో 2009లో వీరి వివాహం జరిగింది
ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు
సంపన్నుల కుటుంబం..
అక్షతా ఆస్తులతో రిషికి చిక్కులు..
బ్రిటిష్ రాణి కంటే ధనవంతులుగా పేరుపొందిన అక్షతా-రిషి సునాక్ దంపతులు
మీడియాలో వీరి సంపద గురించి చర్చనీయాంశంగా మారింది.
అక్షతా రష్యాలో ఒక కంపెనీ కలిగివుందని అక్కడి నెత్తుటి డబ్బుతో డబ్బు సంపాదిస్తున్నారని విమర్శించిన మీడియా
రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో రిషి దంపతులు అక్కడి కంపెనీ నుంచి డబ్బును సంపాదిస్తున్నారని విమర్శలు
ఈ నేపథ్యంలో మీడియా వేదికగా భార్యకు మద్దతగా నిలిచిన రిషి సునాక్
అక్షతా నాన్ డొమిసిల్(శాశ్వత నివాసం యూకే బయట ఉందని) కేటగిరిలో తన నివాసాన్ని చూపెట్టడంతో యూకేలో పన్నులు కట్టాల్సిన అవసరం లేదు
2021లో ఇన్ఫోసిస్ షేర్ల ద్వారా11.6 మిలియన్ పౌండ్ల డివిడెండ్ పొందిన అక్షతా మూర్తి
అక్షతా నానా డొమిసిల్ కేటగిరీలో ఉండటంతో బ్రిటన్ చట్టం ప్రకారం యూకేలో ఆమె పన్నులు కట్టనవసరం లేదు
ఈ పన్నులు కట్టడంపై వివాదం..
అక్షతా మూర్తి ఏ తప్పూ చేయలేదు ఆమె భారత పౌరురాలు, ఆమె భారత్ పాస్ పోర్ట్ ను కలిగివున్నారు. భారత్ లోని ఆస్తులకు సంబంధించిన పన్నులను భారత్ లోనే పన్ను కడతారని మరో వాదన కొనసాగుతోంది. అక్షతా- రిషీ సునాక్ దంపతులు యూకేలో ఉంటున్నప్పుడు ఇక్కడే పన్నులు ఇక్కడే కట్టాలంటూ కొంతమంది విభేదిస్తున్నారు. ధనికులందరికి ఒకే నిబంధనలుంటాయని మరికొందరు వాదిస్తున్నారు. రిషి సునక్ గ్రీన్ కార్డ్, ఆయన భార్య పన్ను వివాదాల కారణంగా యూకే తదుపరి ప్రధానమంత్రిగా రిషి ఎన్నికయ్యే అవకాశాల్లేని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నాన్-డొమిసిల్ స్థితి ద్వారా అక్షతా మూర్తి ప్రతీ ఏటా 2.1 మిలియన్ పౌండ్ల (రూ. 20 కోట్లు) పన్నును తప్పించుకునే వీలుందని ఓ మీడియా సంస్థ అంచనా వేయడం చర్చనీయాంశంగా మారింది.
క్లారిటీ ఇచ్చిన అక్షతా..
విదేశీ ఆదాయంపై యూకే లో పన్నులు కడతానని అక్షతా ప్రకటించారు. పన్ను ఏర్పాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు 2022 ఏప్రిల్ 8న అక్షతామూర్తి చెప్పారు. తన వల్ల తన భర్తకు చీకాకు కలగకూడదంటూ అక్షతా తెలిపారు. తన పన్ను వ్యవహారాలన్నీ చట్టబద్ధమైనవనంటూ అక్షతా ప్రకటించారు.
బోరిస్ రాజీనామా..
బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అపద్ధర్మ ప్రధానిగా బోరిస్ కొనసాగుతున్నారు.
తన సన్నిహితుడు మాజీ ఎంపీ క్రిస్ పించర్ సెక్స్ స్కాండల్, పార్టీ గేట్ కుంభకోణంతో విమర్శల పాలైన బోరిస్ జాన్సన్
బోరిస్ స్థానంలో వేరొకరిని కూర్చోబెట్టడానికి సిద్ధపడ్డ కన్సర్వేటివ్‌లు
ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నుకోవడానికి ప్రక్రియను ఆ పార్టీ ఎంపీలు ప్రారంభించారు. ఈ పోటీలో నిలిచిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందంజలో ఉన్నారు.
కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ గా నిలిచిన వ్యక్తే ప్రధానిగా ఎన్నికవుతారు
ప్రధాని పదవి రేసులో ముందుగా 8 మంది ఉన్నారు. మొత్తం ఐదు రౌండ్లలో జరిగే పోల్‌లో కన్జర్వేటివ్ ఎంపీలు రహస్య ఓట్లు వేసి ఎన్నుకుంటారు. ఎన్నిక ఆరుగురు ఎలిమినేషన్ వరకు కొనసాగుతుంది.
జులై 19నాటికి ముగిసిన నాలుగు రౌండ్లలో రిషి సునాక్ టాప్ లో కొనసాగుతున్నారు. జులై 20న జరిగే చివరి రౌండ్ లో పోటీలో నిలిచే ఇద్దరి పేర్లు ఖరారు కానున్నాయి.
చివరి రౌండ్లో నిలిచిన ఇద్దరి నుంచి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు.
కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను టోరీలను పిలుస్తుంటారు. కన్జర్వేటివ్ పార్టీ టోరీస్ పార్టీ నుంచి ఆవిర్భవించింది. ఈ పార్టీ సభ్యులకు మరోపేరు టోరీస్.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..