Masood Azhar: భారత్‌లో మారణ హోమం సృష్టించిన మసూద్ మృతి అంటూ వార్తలు.. స్పందించని పాక్ ప్రభుత్వం, మీడియా..

|

Jan 02, 2024 | 7:13 AM

భారత్ లో అనేకమంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మసూద్ పై పాకిస్థాన్ లోని భవల్‌పూర్‌లో బాంబు దాడి జరిగినట్లుగా.. ఈ దాడిలో మసూద్‌ మృతిచెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో పాక్‌లోని భవల్‌పూర్‌ మసీదు నుంచి మసూద్‌ తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడగా.. మసూద్ అజహర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడనే టాక్ వినిపిస్తుంది.

Masood Azhar: భారత్‌లో మారణ హోమం సృష్టించిన మసూద్ మృతి అంటూ వార్తలు.. స్పందించని పాక్ ప్రభుత్వం, మీడియా..
Masood Azhar
Follow us on

భారత్ లో పలు దాడులకు కారకుడు.. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజహర్ చనిపోయాడా? లేక బతికే ఉన్నాడా? భవల్‌పూర్‌లో జరిగిన బాంబుదాడిలో మృతి చెందాడంటూ వినిపిస్తున్న వార్తలు నిజమేంత? మసూద్ ఘటనపై పాక్ ప్రభుత్వం స్పందించకపోవడానికి గల కారణాలేంటీ? అనేక అనుమానాలు ప్రస్తుతం అందరి మనసులో కలుగుతున్నాయి. అయితే ఈ కరుడుకట్టిన ఉగ్రవాది చావు గురించి వస్తున్న కథనంపై పాక్ ప్రభుత్వం స్పందించలేదు.

భారత్ లో అనేకమంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మసూద్ పై పాకిస్థాన్ లోని భవల్‌పూర్‌లో బాంబు దాడి జరిగినట్లుగా.. ఈ దాడిలో మసూద్‌ మృతిచెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో పాక్‌లోని భవల్‌పూర్‌ మసీదు నుంచి మసూద్‌ తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడగా.. మసూద్ అజహర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడనే టాక్ వినిపిస్తుంది. అయితే మసూద్‌ మృతిపై అటు పాక్ ప్రభుత్వం కాని.. ఇటు పాక్ మీడియా కాని ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. మసూద్‌పై బాంబు దాడి జరిగినట్లుగా వైరల్‌ అవుతున్న వీడియో పాతదని తెలుస్తోంది. దీంతో మసూద్ బ్రతికే ఉన్నాడా? లేక సోషల్ మీడియా వస్తున్న వార్తల ప్రకారం చనిపోయాడా? అనేది తెలియాల్సి ఉంది.

మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస

భారత్‌లో జరిగిన పలు భీకర దాడులకు ప్రధాన సూత్రధారి మసూద్‌ అజహర్‌. 1995లో భారత్‌ అతడిని అరెస్టు చేసింది. 1999లో విమానాన్ని హైజాక్‌ చేసిన ఉగ్రవాదులు అతడిని విడిపించుకెళ్లారు. ఆ తర్వాత కక్ష కట్టిన మసూదర్ జైషేను స్థాపించాడు. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ మసూద్ అజహర్‌ ప్రమేయం ఉంది. అలాగే 2019 జమ్మూకశ్మీర్‌ పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి వెనుక మసూద్‌ మాస్టర్‌మైండ్‌ ఉందన్న ఆరోపణాలు ఉన్నాయి. పుల్వామా ఘటనలో40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ఐక్యరాజ్యసమితి .. మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మసూద్‌ను అప్పగించాలని భారత్ వందలసార్లు డిమాండ్

భారత్‌లో అనేక దాడులకు కారకుడైన మసూద్ అజహర్‌ను తిరిగి అప్పగించాలంటూ భారత్ ప్రభుత్వం వందల సార్లు డిమాండ్ పెట్టినప్పటికీ.. పాక్ వినలేదు. నెల రోజుల క్రితం కూడా మసూద్‌ను అప్పగించాలని భారత్ అడిగినా పాక్ ససేమిరా అంది. మరో వైపు ఐక్యరాజ్యసమితి ప్రకటన నేపథ్యంలో మసూద్ అజహర్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ చెబుతూ వస్తోంది. ఒకవేళ మసూద్ అజహర్ నిజంగానే చనిపోయినా, పాకిస్థాన్ ఆ విషయం అంగీకరించే పరిస్థితి లేదు. అందువల్ల, ఒకవేళ అతడిపై దాడి జరిగినా.. దాని గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదు. ఎట్టకేలకు మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్ ఇప్పడు ఉన్నాడా? పోయాడా అనేది పాక్ నోరు తెలిచి చెబితే కాని తెలిసే పరిస్థితి లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..