Cyber Attack: అమెరికా, ఇజ్రాయేల్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇరాన్.. పరిస్థితి క్లిష్టంగా మార్చొద్దని వార్నింగ్!
పశ్చిమాసియా దేశాల్లో మరోసారి చిచ్చు రగిలింది. ఇజ్రాయెల్ చేసిన సైబర్ దాడి ఘటన ఈ చిచ్చుకు కారణం. ఇటీవల ఇరాన్ అణుకర్మాగారంపై ఇజ్రాయేల్ సైబర్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
Cyber Attack: పశ్చిమాసియా దేశాల్లో మరోసారి చిచ్చు రగిలింది. ఇజ్రాయెల్ చేసిన సైబర్ దాడి ఘటన ఈ చిచ్చుకు కారణం. ఇటీవల ఇరాన్ అణుకర్మాగారంపై ఇజ్రాయేల్ సైబర్ దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ శత్రువు నంతజ్ ప్లాంట్ పై దాడివెనుక ఉందని కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అదేవిధంగా ఈ విషయంపై అమెరికా పై కూడా తీవ్రంగా విరుచుకుపడింది. ఈ విషయంపై మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమద్ జావేద్ జరీఫ్ తమపై విధ్వాంసాక్రం దాడులు, ఆంక్షలు 2015 నాటి అణు ఒప్పందం పునరుద్ధరణ చర్యలకు ఏ మాత్రం సహకరించవని అన్నారు. ఆంక్షలు, విధ్వాంసాక చర్యలు మాతో రాజీకి దారిచూపించవనే విషయం అమెరికా గ్రహిస్తే మంచిది. ఇటువంటి చర్యలు మరింత క్లిష్టంగా సమస్యను మారుస్తాయి అని తీవ్రంగా చెప్పారు. రష్యా విదేశాంగ మంత్రి సేర్గే లరోవ్ సమక్షంలోనే నంతాజ్ అణు కర్మాగారంపై సైబర్ దాడి చేయడం చాలా ప్రమాదకర జూదంతో సమానమని ఘాటుగా వ్యాఖ్యానించారు. అణు ఒప్పందం పునరుద్ధరణ, అమలలో తమకు ఎటువంటి సమస్యలేదని ఆయన స్పష్టం చేశారు.
నంతాజ్ అణు కర్మాగారాన్ని ఇరాన్ అధ్యక్షుడు పునః ప్రారంభించిన కొద్ది గంటల్లోనే అందులోని విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దీని వెనుక ఇజ్రాయేల్ హస్తం ఉందని ఆ దేశ మీడియానే స్వయంగా వెల్లడించింది. ఇరాన్ మాత్రం స్వల్ప విద్యుత్ ప్రమాదం జరిగినట్టు ఇరాన్ అటామిక్ రెగ్యులేటరీ ప్రకటించింది. అయితే, ప్లాంట్‌లోని విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు అమెరికా, ఇజ్రాయేల్ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడిలో తమ హస్తం లేదని అమెరికా ధ్రువీకరించింది.
Also Read: UK Covid-19: బ్రిటన్‌లో కరోనా థర్డ్ వేవ్ భయాలు..50 వేల మందికి ‘ప్రాణ గండం’..వైద్య నిపుణుల హెచ్చరిక