India – China: భారత్ లోకి చైనా చొరబాట్లు అందుకేనట.. ఆ ఫంగస్ బంగారం కన్నా ఖరీదెక్కువ.. నివేదికలో ఆసక్తికర విషయాలు..
భారత్ - చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారుర. ఇటీవల తవాంగ్ సెక్టార్‌లో అక్రమంగా ప్రవేశించిన చైనా సైన్యాన్ని...
భారత్ – చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారుర. ఇటీవల తవాంగ్ సెక్టార్‌లో అక్రమంగా ప్రవేశించిన చైనా సైన్యాన్ని భారత సైనికులు తిప్పికొట్టారు. అయితే.. చైనా ఎందుకు పదే పదే చొరబాట్లకు పాల్పడుతుందనే విషయంపై ఆరా తీయగా.. అధికారులకు ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఓ రకమైన ఫంగస్ కోసమే చైనా సైనికులు చొరబడుతున్నారని తెలుసుకుని అవాక్కయ్యారు. అయితే ఆ ఫంగస్.. బంగారం కన్నా విలువైనది కావడం గమనార్హం. ఈ మేరకు ఇండో – పసిఫిక్ ఫర్ స్ట్రాటెజిక్ కమ్యూనికేషన్స్ ఓ నివేదికలో వెల్లడించింది.పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్ ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్‌గా పిలుస్తారు. అరుదుగా లభించే ఈ ఫంగస్‌లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. పసుపు, కాషాయం రంగులో అండే వీటిని సూపర్ మష్రూమ్స్‌గా పిలుస్తారు. వీటి ధర బంగారం కంటే చాలా ఎక్కువ. 10 గ్రాముల కార్డిసెప్స్ ధర.. సుమారు రూ. 56 వేలు ఉన్నట్లు తెలుస్తోంది.
చైనా నైరుతిలోని కింగై – టిబెట్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కార్డిసెప్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతర్జాతీయంగా కార్డిసెప్స్ మార్కెట్ విలువ వెయ్యి మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. అత్యధికంగా ఉత్పత్తయ్యే కింగై ప్రాంతంలో రెండు సంవత్సరాలుగా వీటి సాగు తగ్గింది. ఈ కారణంగా వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే.. వీటి కోసమే అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా సైనికులు చొరబడినట్లు ఐపీసీఎస్సీ వెల్లడించింది.
మరోవైపు.. తవాంగ్ ఘర్షణల తర్వాత చైనా కీలక ప్రకటన చేసింది. ఇండియాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి తాము రెడీగా ఉన్నట్టు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ తెలిపారు. తవాంగ్ సెక్టార్ లో ఈ నెల 9 న భారత-చైనా సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఉభయ దేశాల సైనికులూ ఈ ఘర్షణలో గాయపడ్డారు. ఈ ఘర్షణలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. ఏమైనప్పటికీ.. సాధ్యమైనంత త్వరగా ఉభయ పక్షాలకూ ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఇరు దేశాల ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం