Mystory Lake: ఈ లేక్ సైన్స్‌కు సవాల్.. భూమిపై ఎనిమిదవ వండర్.. సన్ మూన్ లేక్ అని ఎందుకంటారో తెలుసా..

|

Jun 26, 2023 | 10:08 AM

ఈ మిస్టరీని శాస్త్రజ్ఞులు నేటికీ  ఛేదించలేదు. అదే సమయంలో సహజ దృశ్యాలు ప్రజలను ఆకర్షించే అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ రోజు మనం ఒక మిస్టరీ ప్రదేశం.. సహజ అందం గురించి తెలుసుకుందాం.. ఈ మిస్టరీ అందాలను భూమిపై  ఎనిమిదవ అద్భుతంగా పిలుస్తారు. 

Mystory Lake: ఈ లేక్ సైన్స్‌కు సవాల్.. భూమిపై ఎనిమిదవ వండర్.. సన్ మూన్ లేక్ అని ఎందుకంటారో తెలుసా..
Sun Mooon Lake
Follow us on

ఈ ప్రపంచంలో ప్రకృతి సృష్టించిన అందాలకు కొదవు లేదు. ఎన్నో, వింతలు, విశేషాలు రహస్యాలకు నెలవు. ప్రకృతి సృష్టించిన ఈ అందమైన ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు చాలా దూరం నుండి ప్రపంచంలోని ప్రతి మూలలో అనేక రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఈ మిస్టరీని శాస్త్రజ్ఞులు నేటికీ  ఛేదించలేదు. అదే సమయంలో సహజ దృశ్యాలు ప్రజలను ఆకర్షించే అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ రోజు మనం ఒక మిస్టరీ ప్రదేశం.. సహజ అందం గురించి తెలుసుకుందాం.. ఈ మిస్టరీ అందాలను భూమిపై  ఎనిమిదవ అద్భుతంగా పిలుస్తారు.

ఈ వింత సరస్సు తైవాన్ లో ఉంది. దీనిని సన్ మూన్ లేక్ అని అంటారు. ఈ సరస్సు దీని అందంతో  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు గొప్పదనం ఏమిటంటే.. తూర్పు నుంచి మీరు చూస్తే అది సూర్యుడిలా.. పశ్చిమం నుండి అర్ధ చంద్రునిలా కనిపిస్తుంది. ఈ వింతను చూస్తుంటే చూపరులకు అద్భుతం అనిపిస్తుంది.

ఈ సరస్సు ఎందుకు ప్రత్యేకం అంటే.. 
సరస్సు చుట్టుపక్కల ఉన్న వాతావరణం అందంగా ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ చూస్తే పర్వతాలు కనువిందు చేస్తాయి. సరస్సు అందాలకు మరింత వన్నె తెస్తాయి. తైవాన్‌లోని ఈ సరస్సు ఇక్కడ అతిపెద్ద, అందమైన సరస్సు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు వింతైన సోయగాలతో అలరించే ఈ సరస్సుని సందర్శించేందుకు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ఈ సరస్సు  సంవత్సరంలో 365 రోజులు అందంగా ఉన్నప్పటికీ… శీతాకాలంలో ఈ సరస్సు అందాలు మరింత దిగ్విణీకృతం అవుతాయి. ఈ అందాలను చూసి ఆస్వాదించడం ఓ మధురాభూతినిస్తాయి.  ఈ సరస్సు ఉన్న ప్రదేశం జంటలకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. తమ భాగస్వామితో సరస్సు ఒడ్డున కూర్చుని అందాలను ఆస్వాదించడం శృంగార క్షణాలు గడపం ఓ మధురానుభూతినిస్తాయని అంటారు. పర్యాటకుల  కోసం ఒడ్డున అనేక విలాసవంతమైన హోటళ్లు నిర్మించబడ్డాయి. అందమైన ఈ సరస్సు ను చూస్తే అక్కడే చూపు ఆగిపోతుంది. అందమైన దృశ్యాలను చూస్తూ చూస్తున్న చోటే నిలిచిపోతారు. అంతేకాదు ఈ సరస్సులో బోటింగ్ కూడా ఆనందించవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..