Pakistan News: పాకిస్తాన్‌లో తీవ్ర ద్రవ్యోల్భణం.. పెట్రోలు, చక్కెర, పాలు సహా పలు వస్తువుల ధరల పెరుగుదల

|

Nov 21, 2021 | 6:08 AM

Pakistan News: పాకిస్తాన్‌లో ద్రవ్యోల్భణం పెరగడంతో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోలు రూ.150కి ఎలా చేరుతోందో పంచదార కూడా కిలో రూ.150కి చేరుకుంటుందని

Pakistan News: పాకిస్తాన్‌లో తీవ్ర ద్రవ్యోల్భణం.. పెట్రోలు, చక్కెర, పాలు సహా పలు వస్తువుల ధరల పెరుగుదల
Pakistan
Follow us on

Pakistan News: పాకిస్తాన్‌లో ద్రవ్యోల్భణం పెరగడంతో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోలు రూ.150కి ఎలా చేరుతోందో పంచదార కూడా కిలో రూ.150కి చేరుకుంటుందని ప్రజలు చెబుతున్నారు. ఒక చిన్న పిజ్జా విలువ 400 రూపాయలు, కాఫీ 200 రూపాయలు అని ఇక్కడి యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఒక సామాన్య వ్యక్తి ఇల్లు నడపడం కష్టంగా మారింది. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

పాకిస్థాన్‌లో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్థాన్‌లోని మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలు పెద్ద సమస్యగా పరిగణించనప్పటికీ వీటికి తాము భయపడమని అక్కడి హిందువులు పేర్కొన్నారు. కానీ ద్రవ్యోల్బణం వల్ల వారి జీవితాలు దుర్భరంగా మారాయి. పాకిస్తాన్‌ ప్రభుత్వం వీరికోసం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 70 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరుకుంది. ది న్యూస్ నివేదిక ప్రకారంపాకిస్తాన్‌లో ఆహార ధరలు రెండింతలు పెరిగాయి.

నెయ్యి, నూనె, పిండి, చికెన్ ధరలు ఇప్పటివరకు చూడనంత ఎత్తుకు చేరాయి. సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. పాకిస్తాన్ యొక్క ఫెడరల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (FBS) ప్రకారం.. అక్టోబర్ 2018 నుంచి అక్టోబర్ 2021 వరకు విద్యుత్ ధరలు యూనిట్‌కు రూ. 4.06 నుంచి రూ. 6.38కి 57 శాతం పెంచారు. అలాగే LPG సిలిండర్ల ధరలు 3.89 శాతం పెంచారు. బంగాళదుంప, చక్కెర, గుడ్లు, ఆవాల నూనె, చికెన్ ధరలు వరుసగా 6.05 శాతం, 3.74 శాతం, 3.16 శాతం, 1.39 శాతం, 1.09 శాతం పెరిగాయి.

తల్లిదండ్రులకు గమనిక..! పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యాధికి గురైనట్లే..?