Snake Massage Centre: ఆ దేశంలో రిలాక్స్ కోసం వంటిపై నూలు పోగులేకుండా.. కొండచిలువలతో మసాజ్

|

Jan 14, 2022 | 12:16 PM

Snake Massage Centre: మసాజ్ చేస్తే.. శరీరానికి అలసట తీరి.. రీఫ్రెష్ అవుతారు. అలాగని ఆ దేశంలో మసాజ్ కావాలా నాయనా..? అని ఎవరైనా అడిగితే వెంటనే ఒకే అనేయకండి.. ఆ దేశంలో మసాజ్..

Snake Massage Centre: ఆ దేశంలో రిలాక్స్ కోసం వంటిపై నూలు పోగులేకుండా.. కొండచిలువలతో మసాజ్
Python Massage Centre
Follow us on

Snake Massage Centre: మసాజ్ చేస్తే.. శరీరానికి అలసట తీరి.. రీఫ్రెష్ అవుతారు. అలాగని ఆ దేశంలో మసాజ్ కావాలా నాయనా..? అని ఎవరైనా అడిగితే వెంటనే ఒకే అనేయకండి.. ఆ దేశంలో మసాజ్ చేయడానికి చేతులనో…లేదా ఏదైనా పరికరాలనో ఉపయోగించరు.. బోర్లా పడుకోబెట్టి.. శరీరం పై పాములను వదులుతారు.. అదీ మనుషులను అమాంతం మిగేసి.. కడుపునింపుకొనే కొండచిలువలను మసాజ్( python massage centre) చేయడానికి ఉపయోగిస్తారు. ఇలా పాములు శరీరంపై వేస్తే.. చక్కని మసాజ్ లభిస్తుందని ఆ స్పా నిర్వాహకులు చచెబుతున్నారు. ఈ మసాజ్ సెంటర్ ఇండోనేషియా (Indonesia)రాజధాని జకార్తాలో ఉంది.

ఇండోనేషియాలో 2009 లో ఈ ‘స్పా’ ప్రారంభమైంది. ఈ స్పా లో మసాజ్ చేయడానికి కొండ చిలువలను ఉపయోగిస్తారు. అలా మసాజ్ చేయించుకోవాలంటే వంటి పై నూలు పోగు కూడా ఉంచుకోకూడదు. మాసాజ్ చేయించుకోవడం కోసం బోర్లాపడుకుని.. వంటి మీద బట్టలు తీసివేస్తే.. అప్పుడు కొండచిలువలను వీపుపై వదులుతారు. అలా ఆ పాములు శరీరంపై మెత్తగా కదలడం వల్ల కస్టమర్లు మంచి అనుభూతికి లోనవ్వుతారని స్పా నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ పాముల మసాజ్ వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది అని చెబుతున్నారు. స్నేక్ మసాజ్” ఒత్తిడిని దూరం చేస్తుందని అంటారు. పాములతో శరీరం కప్పబడి ఉండటం వలన ఒత్తిడితో కూడిన పరిస్థితిని ఎదురవుతుంది దీంతో శరీరం ఇతర రసాయనాలతోపాటు ఆడ్రినలిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది హృదయ స్పందన రేటును, రక్తపోటును పెంచుతుంది. అంతేకాదు శరీరానికి కావలసిన శక్తినిస్తుంది అంటున్నారు. స్పా నిర్వాహకులు.

అయితే పాములు కదా.. అవి కరుస్తాయోమో.. అన్న భయం అక్కడ ప్రజలకు ఉండదు.. ఎందుకంటే జకార్తాలోని ప్రజలెప్పుడూ పాములతోనే సావాసం చేస్తారు. పాములను నియంత్రించడంలో మంచి నేర్పరులు.. పైగా వాటిని స్నాక్స్ గా చేసుకొని ఆహారంగా తీసుకొంటారు కూడా.. దీంతో ఈ పాముల స్పా రోజు రోజుకీ విపరీతమైన డిమాండ్ ను సొంతం చేసుకొన్నది.

Also Read:  సంక్రాంతి స్పెషల్ ఫుడ్.. అమ్మమ్మ కాలం నాటి అరిసెలు తయారీ.. ఆరోగ్య ప్రయోజనాలు..