చైనాలో భారతీయ విద్యార్ధి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బీహార్ లోని గయ జిల్లాకు చెందిన అమన్ నాగ్ సేన్ అనే ఈ విద్యార్ధి టియాన్జిన్ సిటీలోని ఓ విద్యా సంస్థ హాస్టల్ లో గత నెల 29 న విగతజీవిగా కనిపించాడు. ఇతడి మరణానికి కారకుడని భావిస్తున్న ఓ విదేశీ విద్యార్థిని చైనా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నగరంలోని ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న అమన్ ను ఈ స్టూడెంట్ బహుశా ఆత్మహత్యకుప్రేరేపించి ఉండవచ్చునని భావిస్తున్నారు. హాస్టల్ లో ఓ భారతీయ విద్యార్ధి డెడ్ బాడీ పడి ఉందని పోలీసులకు ఆ రోజు రాత్రి కాల్ అందిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ బీజింగ్ లోని భారత ఎంబసీకి తెలియజేసింది.మరో విదేశీ విద్యార్థే ఇతని మృతికి కారణమని భావిస్తున్నట్టు కూడా పేర్కొంది. తమ దేశ చట్టాల ప్రకారం ఈ కేసుపై దర్యాప్తు జరుపుతామని, పైగా అమన్ డెడ్ బాడీకి ఇక్కడే ఆటాప్సీ నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.భారత ఎంబసీ అధికారులు అమన్ కుటుంబానికి అతని మృతి సమాచారాన్ని తెలియజేశారు.
కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా చైనాలోనే ఉండిపోయిన కొద్దిమంది భారతీయ విద్యార్థుల్లో అమన్ కూడా ఒకరు. కానీ అక్కడే చదువుకుంటున్న 23 వేలమందికి పైగా భారత విద్యార్థులు మాత్రం స్వదేశానికి తిరిగివచ్చేశారు. ప్రస్తుతం భారత- చైనా దేశాల మధ్య విమాన రాకపోకలు లేవు. కాగాప్-చైనాలో మళ్ళీ కోవిడ్ విజృంభిస్తోంది. లక్షలాది ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేబట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : పోయి పనిచూసుకోమన్న కేంద్రం..!మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )
ఛాయ్ అమ్మిన ఎమ్మెల్యే…ఒక్క ఛాయ్ 15 లక్షలు.. మీకు కావాలా..? ఎందుకో తెలుసా.?:MLA sold by Chai Video.