US Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా ఈసారి కూడా భారత సంతతి విద్యార్థే
అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్ స్పెల్లింగ్ బీ 2023 పోటీల్లో ఈసారి కూడా భారతీయ సంతతికి చెందిన విద్యార్థి గెలిచాడు. 11 అక్షరాలున్న శామాఫైల్ (psammophile) అనే పదాన్ని కరెక్టుగా పలికి.. దేవ్ షా అనే 14 ఏళ్ల విద్యార్థి 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు.
అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్ స్పెల్లింగ్ బీ 2023 పోటీల్లో ఈసారి కూడా భారతీయ సంతతికి చెందిన విద్యార్థి గెలిచాడు. 11 అక్షరాలున్న శామాఫైల్ (psammophile) అనే పదాన్ని కరెక్టుగా పలికి.. దేవ్ షా అనే 14 ఏళ్ల విద్యార్థి 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. శామాఫైల్ అంటే మట్టిలో కనిపించే జీవి లేదా మొక్క అని అర్ధం. psammo అంటే గ్రీకు భాషలో మట్టి అని అర్థం. అలాగే phile అంటే ప్రేమ అని అర్థం. అయితే ఈ స్పెల్లింగ్ పోటీల్లో మొత్తం 231 మంది విద్యార్థులు పాల్గొన్నారు.వీరిలో 11 మంది ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. చివరికి దేవ్ షా విజేతగా నిలిచాడు.
దేవ్ షా తండ్రి దేవల్ 29 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ సందర్భంగా దేవల్ మాట్లాడుతూ తన కుమారుడు మూడేళ్ల వయసు నుంచే స్పెల్లింగ్ గుర్తుపెట్టుకొని చెప్పడం మొదలుపెట్టాడని.. ఆ తర్వాత ది నార్త్‌సౌత్ ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో సైతం పాల్గొన్నాడని వెల్లడించారు. అయితే ఈ సంస్థ భారత్‌లో పిల్లలకు స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ఇదిలా ఉండగా 2019,2021లో కూడా దేవ్ షా స్పెల్లింగ్ బీ పోటీలో పాల్గొన్నాడు. గడిచిన 24 ఏళ్లలో దక్షిణాసియాకు చెందిన సంతతి వ్యక్తులే 22 సార్లు స్పెల్లింగ్ బీ పోటీల్లో నెగ్గడం విశేషం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..