అమెరికాలో డోర్‌బెల్ ప్రాంక్.. భారత సంతతి వ్యక్తికి జీవిత కాల జైలు శిక్ష విధింపు..

అమెరికాలోని భారత సంతతి వ్యక్తికి చుక్కెదురైంది. ముగ్గురు యువకులను తన కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో అతనికి కోర్టు జీవిత కాల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే కాలిఫోర్నియాలోని అనురాగ్ చంద్ర అనే భారత సంతతి వ్యక్తి ఉంటున్నాడు.

అమెరికాలో డోర్‌బెల్ ప్రాంక్..  భారత సంతతి వ్యక్తికి జీవిత కాల జైలు శిక్ష విధింపు..
Anurag Chandra

Updated on: Jul 18, 2023 | 1:15 PM

అమెరికాలోని భారత సంతతి వ్యక్తికి చుక్కెదురైంది. ముగ్గురు యువకులను తన కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో అతనికి కోర్టు జీవిత కాల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే కాలిఫోర్నియాలోని అనురాగ్ చంద్ర అనే భారత సంతతి వ్యక్తి ఉంటున్నాడు. అయితే 2020లో కొంతమంది యువకులు అతని ఇంటికి వచ్చి డోర్ బెల్ ప్రాంక్ చేశారు. చంద్రకు కోపం రావడంతో.. ఆ యువకులు అక్కడి నుంచి తమ కారులో పారిపోయారు. కోపం ఆపుకోలేని చంద్ర.. ఆ యువకులు వెళ్తున్న కారుని వెంబడించాడు. వాళ్లని ఢీకొట్టే వరకు వెంబడిస్తూనే ఉన్నాడు. చివరికి వాళ్ల కారును ఢీకొట్టడంతో అది ఓ చెట్టుకు బలంగా ఢీకొని ధ్వంసమైంది.

ఈ దుర్ఘటనలో ముగ్గురు 16 ఏళ్ల యువకులు చనిపోయారు. మరో ముగ్గురు యువకులకు తీవ్రంగా గాయపడ్డారు. 2020 జులై 19 న రాత్రిపూట ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు చంద్రను అరెస్టు చేశారు. 2020 జులై 20 నుంచి రాబర్ట్ ప్రెస్లీ డిటెన్షన్ సెంటర్‌లో చంద్ర పోలీసులు కస్టడీలోనే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్ర ముగ్గురుని హత్య చేసినట్లు నేరారోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తాజాగా కోర్టు అతనికి జీవితకాల జైలు శిక్ష విధించింది. ఒక వ్యక్తి కోపానికి, దుష్ప్రవర్తన వల్ల ఎన్నో కుటుంబాల జీవితాలు ఒకేలా ఉండవని.. చంద్రాకు జీవిత కాల జైలు శిక్ష వేసినందుకు న్యాయమూర్తి నవారోకు కృతజ్ఞతలు చెబుతున్నానని.. జిల్లా అటార్నీ మైక్ హెస్ట్రిన్ అన్నారు.