Khalistan Supporters: భారత హైకమిషన్ కార్యాలయంపై దాడి.. త్రివర్ణ పతాకాన్ని కిందికి దించి అవమానం..

|

Mar 20, 2023 | 8:04 AM

దేశంలోనే కాదు విదేశాల్లో వారి ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. వారిస్ పంజాబ్ దే పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలో..

Khalistan Supporters: భారత హైకమిషన్ కార్యాలయంపై దాడి.. త్రివర్ణ పతాకాన్ని కిందికి దించి అవమానం..
Khalistani Elements
Follow us on

ఖలిస్తాన్ వేర్పాటువాదులు రోజు రోజుకు రెచ్చపోతున్నారు. హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. దేశంలోనే కాదు విదేశాల్లో వారి ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. వారిస్ పంజాబ్ దే పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలో బ్రిటన్ లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. అవాంఛిత సంఘటనలకు కారణం అయ్యాయి. లండన్ ఆల్డ్‌విచ్ 4 ఎన్ఏ, డబ్ల్యూసీ2బీలో గల భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులు చేశారు. సెక్యురిటీని ఛేదించుకుని మరీ వారు కార్యాలయానికి దూసుకుపోయారు. విధ్వంసం సృష్టించారు. హైకమిషన్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయ భవనంపై ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని కిందికి దించి.. తమ ఖలిస్తాన్ వేర్పాటు జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. వెంటనే భారత హైకమిషన్ కార్యాలయంలో ఓ అధికారి వారి చర్యలను అడ్డుకున్నారు. వారి నుంచి త్రివర్ణ పతాకాన్ని లాక్కున్నారు.

ఓ వ్యక్తి భారత్ హైకమిషన్ కార్యాలయాన్ని మొదటి అంతస్తు పైకి చేరుకుని జాతీయ పతాకాన్ని కిందికి దించి, ఖలిస్తాన్ జెండాను ఎగురవేస్తోన్న వీడియోను ఏఎన్ఐ విడుదల చేసింది. ఈ ఘటన ఆల్డ్‌విచ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా మారింది. పెద్ద సంఖ్యలో భారత హైకమిషన్ కార్యాలయానికి చేరుకున్న ఖలిస్తాన్ మద్దతుదారులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని వారు ప్రతిఘటించడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఖలిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యను ఇక్కడ చూడండి..

ఈ ఘటన తర్వాత వెంటనే స్పందించారు స్థానిక భారతీయ  ఎన్‌ఆర్ఐలు. ఏ స్థలంలో అవమానం జరిగిందో అక్కడే భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇందులో సంబంధించిన వీడియోను ఆ తర్వాత పోస్ట్ చేశారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు గట్టిగా బుద్ది చెప్పారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి..

అదనపు పోలీసు బలగాలను రప్పించిన అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. భారత్ లోని బ్రిటన్ రాయబార కార్యాలయానికి సమన్లను జారీ చేసింది. లండన్ లో చోటు చేసుకున్న ఘటనకు సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం