China: ఈ నినాదాలతో మార్మోగిన భారత్-చైనా సరిహద్దు ప్రాంతం.. వీడియో వైరల్..

భారతదేశంలో శతాబ్ధాల కల నెరవేరింది. రామ భక్తులే కాదు యావత్ దేశం వేచి ఉన్న నిరీక్షణ వీడింది. ఉత్తరప్రదేశ్‎లో అయోధ్య బాల రాముని మందిరం ప్రణ ప్రతిష్ఠ అద్భుతంగా జరిగింది. ఈ తరుణంలో చైనా సరిహద్దుల్లో పొరుగుదేశ సైనికులు, మన దేశ జవానులు కలిసి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఇక సోమవారం అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరై సంతోషం వ్యక్తం చేశారు.

China: ఈ నినాదాలతో మార్మోగిన భారత్-చైనా సరిహద్దు ప్రాంతం.. వీడియో వైరల్..
China Armay

Updated on: Jan 23, 2024 | 5:13 PM

భారతదేశంలో శతాబ్ధాల కల నెరవేరింది. రామ భక్తులే కాదు యావత్ దేశం వేచి ఉన్న నిరీక్షణ వీడింది. ఉత్తరప్రదేశ్‎లో అయోధ్య బాల రాముని మందిరం ప్రణ ప్రతిష్ఠ అద్భుతంగా జరిగింది. ఈ తరుణంలో చైనా సరిహద్దుల్లో పొరుగుదేశ సైనికులు, మన దేశ జవానులు కలిసి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఇక సోమవారం అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరై సంతోషం వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే అయోధ్య రామాలయ సంబరాలు పొరుగు దేశాలకు, దేశాల సరిహద్దులకు విస్తరించాయి. అమెరికాలోనూ కాషాయ జెండాలను పట్టుకుని వేడుకలు చేసుకున్నారు. భారతీయులతో పాటు పొరుగుదేశాల వారు పాల్గొన్నారు. చైనా సైనికులు ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేసిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. వాస్తవాధీన రేఖ వెంట భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు నినాదాలు చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

జై శ్రీరామ్‌’ నినాదాన్ని ఎలా ఉచ్చరించాలన్న విషయాన్ని చైనా భద్రతా బలగాలకు భారత సైనికులు వివరిస్తున్న మొత్తం తీరు ఈ వీడియోలో ఉంది. అందుకు తగినట్లుగానే చైనా సైనికులు ‘జై శ్రీరామ్‌’ నామస్మరణ చేయడం కనిపించింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే ఓ మాజీ సైనికుడు దీన్ని ‘ఎక్స్‌’లో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. సాధారణంగా భారత్‌-చైనా సరిహద్దులో రేఖ వద్ద ఉన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనేక సార్లు వివాదంగా కూడా మారింది. అలాంటి చేదు అనుభవాల నుంచి చైనా బలగాలు జై శ్రీరామ్ అంటూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మన దేశం గొప్ప తనం ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతోందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. గతంలో తీరం వెంబడి వచ్చిన సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..