కరోనా ఎఫెక్ట్: మన దేశ ర్యాంకు ఎంతంటే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరణ రోజురోజుకు పెరుగుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు ఆ దేశం సహా ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య వెయ్యికి దాటింది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి విస్తరణపై హంబోల్ట్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు మోడల్ నెట్‌వర్క్ ద్వారా సర్వే చేశారు. ఈ జాబితాలో భారత్ 17వ స్థానంలో ఉంది. భారత్‌లో 3 కరోనా […]

కరోనా ఎఫెక్ట్: మన దేశ ర్యాంకు ఎంతంటే..!
Follow us

| Edited By:

Updated on: Feb 11, 2020 | 8:53 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరణ రోజురోజుకు పెరుగుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు ఆ దేశం సహా ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య వెయ్యికి దాటింది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి విస్తరణపై హంబోల్ట్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు మోడల్ నెట్‌వర్క్ ద్వారా సర్వే చేశారు. ఈ జాబితాలో భారత్ 17వ స్థానంలో ఉంది. భారత్‌లో 3 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా 4వేల విమానాశ్రయాలు, 25వేలకు ప్రత్యక్ష సంబంధమున్న మార్గాల్లో ఈ పరిశోధన జరిగింది. వైమానిక ప్రయాణీకుల ద్వారా ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని ఈ సర్వేలో తేల్చారు. పరిశోధనల అంచనా ప్రకారం కరోనా వైరస్ సోకే ప్రమాదమున్న మొదటి 10 దేశాలుగా థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తైవాన్, అమెరికా, వియత్నాం, మలేషియా, సింగపూర్, కంబోడియాలు ఉన్నాయి. ఇక ఈ వైరస్ విస్తరణ ప్రభావానికి సంబంధించి భారత్‌లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టాప్‌ రిస్క్‌లో ఉంది. ఆ తరువాత ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోచి విమానాశ్రయాలు ఉన్నాయి.

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..