AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాతో ట్రేడ్ వార్ కు స్వస్తి ?

భారత, అమెరికా మధ్య మెల్లగా క్షీణిస్తున్న వాణిజ్య సంబంధాలను ఇప్పటికైనా ఓ గాడిన పెట్టి.. వీటికి ‘ పునరుత్తేజం ‘ కల్పించేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోంది. ఆ దేశంతో చర్చలకు సుముఖంగా ఉన్నట్టు సూచనప్రాయంగా తెలిపింది. అమెరికా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ప్రభుత్వం భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా భారత్ నుంచి తమ దేశం దిగుమతి చేసుకునే సరకుల మీద టారిఫ్ పెంచారు. ఫలితంగా ఇక […]

అమెరికాతో ట్రేడ్ వార్ కు స్వస్తి ?
Anil kumar poka
|

Updated on: Jun 04, 2019 | 12:59 PM

Share

భారత, అమెరికా మధ్య మెల్లగా క్షీణిస్తున్న వాణిజ్య సంబంధాలను ఇప్పటికైనా ఓ గాడిన పెట్టి.. వీటికి ‘ పునరుత్తేజం ‘ కల్పించేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోంది. ఆ దేశంతో చర్చలకు సుముఖంగా ఉన్నట్టు సూచనప్రాయంగా తెలిపింది. అమెరికా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ప్రభుత్వం భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా భారత్ నుంచి తమ దేశం దిగుమతి చేసుకునే సరకుల మీద టారిఫ్ పెంచారు. ఫలితంగా ఇక ‘ ప్రతీకార ‘ చర్యలకు బదులు సంప్రదింపులతో అమెరికాను ప్రసన్నం చేసుకోవాలని మన ప్రభుత్వం భావిస్తోంది. భారత్ కు వాణిజ్య రాయితీనిచ్చేందుకు ట్రంప్ నిరాకరించిన నేపథ్యంలో ఆ దేశానికి ఎగుమతి చేయదలచిన సుమారు 2 వేల వస్తువులను సుంకం లేకుండా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశంతో మరీ కఠినంగా వ్యవహరించిన పక్షంలో అది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలను అతిక్రమించినట్టు అవుతుందని భావిస్తున్నారు. కాగా-కొత్తగా వాణిజ్య శాఖ మంత్రిగా నియమితులైన పీయూష్ గోయెల్ ఈ నెల 6 న స్థానిక అధికారులు, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై ఈ అంశం మీద చర్చించనున్నారు. పైగా అమెరికానుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద కొత్తగా సుంకాలు వేయకుండా చూడాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. అమెరికాతో ఇక చర్చల మార్గమే బెస్ట్ అని అధికారులు ఓ నిర్ణయానికి వఛ్చినట్టు సమాచారం.

Follow Us
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి
జిమ్‌లో అకస్మాత్తుగా కుప్పకూలడానికి కారణాలేంటి?
జిమ్‌లో అకస్మాత్తుగా కుప్పకూలడానికి కారణాలేంటి?
22 ఏళ్లకే రూ.46 వేలు.. బీకామ్ చదివి క్యాబ్ డ్రైవర్‌గా మారిన యువకు
22 ఏళ్లకే రూ.46 వేలు.. బీకామ్ చదివి క్యాబ్ డ్రైవర్‌గా మారిన యువకు