Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి.. భారత పౌరులకు హెచ్చరికలు చేసిన ఎంబసీ

|

Oct 07, 2023 | 8:41 PM

తమ దేశంపై దాడికి దిగినటువంటి హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ దీటుగా ఎదుర్కొంటోంది. దీనివల్ల ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉంటున్నటువంటి భారత పౌరులకు అక్కడి భారత ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. ఎవరూ కూడా అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. అలాగే స్థానిక అధికారులు సూచించే భద్రతా ప్రొటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని పేర్కొంది.

Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి.. భారత పౌరులకు హెచ్చరికలు చేసిన ఎంబసీ
Israel Palestine Conflict
Follow us on

తమ దేశంపై దాడికి దిగినటువంటి హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ దీటుగా ఎదుర్కొంటోంది. దీనివల్ల ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉంటున్నటువంటి భారత పౌరులకు అక్కడి భారత ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. ఎవరూ కూడా అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. అలాగే స్థానిక అధికారులు సూచించే భద్రతా ప్రొటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని పేర్కొంది. ముఖ్యంగా అనవసరంగా ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని చెప్పింది. అలాగే సురక్షిత శిబిరాలకు చేరువగా ఉండండని తెలిపింది. అత్యవసర పరిస్థితులు తలెత్తినట్లైతే వెంటనే ఎంబసీ సిబ్బందిని సంప్రదించాలని టెల్‌ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం తమ అడ్వైజరీలో ఈ కీలక విషయాలను జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. గతంలో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. శనివారం ఉదయం గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. మరోవైపు అటు పాలస్తీనాకు చెందినటువంటి హమాస్‌ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో ఇజ్రాయెల్‌ సైన్యం అప్రమత్తమైంది. వెంటనే వారిపై ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటన చేసింది. గాజా స్ట్రిప్ వివాదస్పదంగా ఉన్న ప్రాంతం. అయితే అక్కడి నుంచే పాలస్తీనా ముష్కరులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షాన్ని కురిపించారు. జెరూసలెం, టెల్ అవివ్‌‌తో పాటుగా దేశవ్యాప్తంగా ఎయిర్‌ రైడ్‌ సైరన్ల మోత మోగిపోయింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు పాలస్తీనా మిలిటెంట్లు.

దీనివల్ల ఇజ్రాయిల్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొరబడ్డారని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. అలాగే సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావొద్దని హెచ్చరికలు చేసింది. అంతేకాదు ఈ దాడిలో హమాస్‌ మిలిటెంట్లతో పాటుగా ఇతర ఇస్లామిక్‌ జిహాద్‌ గ్రూప్‌ ముఠాలు కూడా చేరినట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను మొదలుపెట్టామని హమాస్‌ మిలిటరీ వింగ్‌ హెడ్‌ మొహమ్మద్‌ డెయిఫ్‌ ప్రకటన చేశాడు. శనివారం తెల్లవారుజామునే ‘ఆపరేషన్‌ ఆల్‌-అక్సా స్ట్రామ్‌’ మొదలైందని.. ఇప్పటిదాకా దాదాపు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్‌ చెప్పినట్లు ఓ వీడియో సందేశం వెలుగుచూసింది. అయితే డెయిఫ్‌పై గతంలోనే చాలాసార్లు దాడులు జరిగాయి. దీనివల్ల కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న మొహమ్మద్‌ డెయిఫ్‌ ఇప్పుడిలా వీడియోను విడుదల చేయడం ఇరుదేశాల మధ్య ఆందోళనను తీవ్రతరం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..