AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Temple in California: కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయంపై దాడి! ఖండించిన భారత ప్రభుత్వం

కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రార్థనా స్థలాలకు భద్రత పెంచాలని కోరింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ సంఘటనను ఖండించారు. BAPS సంస్థ కూడా ఈ దాడిని ఖండించింది.

Hindu Temple in California: కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయంపై దాడి! ఖండించిన భారత ప్రభుత్వం
Hindu Temple In California
SN Pasha
|

Updated on: Mar 09, 2025 | 1:51 PM

Share

కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లోని హిందూ దేవాలయంలో జరిగిన విధ్వంసక సంఘటనను భారత ప్రభుత్వం ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ పని చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటన దృష్ట్యా ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని కూడా కోరింది. “కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లోని ఒక హిందూ ఆలయంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన నివేదికలను మేం చూశాము. ఇటువంటి నీచమైన చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాము” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. “ఈ చర్యలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని స్థానిక చట్ట అమలు అధికారులను మేం కోరుతున్నాము” అని ఆయన అన్నారు.

ఈ సంఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జైస్వాల్ మాట్లాడుతూ.. చినో హిల్స్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించారని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS) శనివారం తెలిపింది. “ఈసారి కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో మరో మందిరం గోడలపై హిందూ వ్యతిరేక నినాదాలు రాసి అపవిత్రం చేసే ప్రయత్నం జరిగిన నేపథ్యంలో, హిందూ సమాజం ద్వేషానికి వ్యతిరేకంగా దృఢంగా నిలుస్తుంది. చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని సమాజంతో కలిసి, మేం ద్వేషాన్ని వ్యతిరేకిస్తాం” అని BAPS పబ్లిక్ అఫైర్స్ ఎక్స్లో పోస్ట్‌ చేసింది.

మేక రక్తం తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
మేక రక్తం తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
తులా రాశి వార్షిక ఫలితాలు 2026: ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది
తులా రాశి వార్షిక ఫలితాలు 2026: ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది
అమరావతి రైతుల సమస్యలపై AP సర్కార్ స్పెషల్ ఫోకస్
అమరావతి రైతుల సమస్యలపై AP సర్కార్ స్పెషల్ ఫోకస్
కలివికోడి పేరుతో భారీ స్కాం.. ఖజానా ఖాళీకి కుట్ర..
కలివికోడి పేరుతో భారీ స్కాం.. ఖజానా ఖాళీకి కుట్ర..
అతి తక్కువ పెట్టుబడితో లక్షలు కురిపించే అద్భుతమైన బిజినెస్‌!
అతి తక్కువ పెట్టుబడితో లక్షలు కురిపించే అద్భుతమైన బిజినెస్‌!
పంచ లోహాలను నమ్ముకో.. సంపదను పెంచుకో
పంచ లోహాలను నమ్ముకో.. సంపదను పెంచుకో
కన్య రాశి వార్షిక ఫలితాలు 2026: వారి ఆదాయానికి లోటుండకపోవచ్చు..!
కన్య రాశి వార్షిక ఫలితాలు 2026: వారి ఆదాయానికి లోటుండకపోవచ్చు..!
2026లో ఫ్యాట్‌లాస్‌ జర్ని స్టార్ట్ చేస్తున్నారా?.. ఈ డ్రింక్‌తో
2026లో ఫ్యాట్‌లాస్‌ జర్ని స్టార్ట్ చేస్తున్నారా?.. ఈ డ్రింక్‌తో
శీతాకాలం ప్రతిరోజు స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కే !
శీతాకాలం ప్రతిరోజు స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కే !
ఏపీలోని మహిళలకు కూటమి సర్కార్ శుభవార్త.. కొత్తగా నియామకాలు
ఏపీలోని మహిళలకు కూటమి సర్కార్ శుభవార్త.. కొత్తగా నియామకాలు