Long Living: వందేళ్లు బతికే సీక్రెట్.. ఈ దేశస్తులకు తెలుసు.. వీరికి మాత్రమే ఇదెలా సాధ్యమవుతోంది..
మనిషి ఆయువు వందేళ్లంటారు.. కానీ ఇప్పుడు పట్టుమని పాతికేళ్లు బతకడమే గగనంగా మారుతోంది. ఎక్కడి నుంచి ఏ మహమ్మారి పంజా విసురుతుందో తెలియదు. దానికి తోడు చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ మరణాలు ఎక్కువవుతున్నాయి. ఉన్నట్టుండే మనుషులు కుప్పకూలుతున్నారు. ఇక నోటి నుంచి చర్మం వరకు ఎన్నో రకాల క్యాన్సర్ లు పుట్టుకొస్తున్నాయి. వీటన్నిటి నడుమ ప్రశాంతంగా ఓ అరవై ఏళ్ల ఆయుర్ధాయం కూడా కష్టమవుతోంది. మరి ఎక్కడైనా పూర్ణాయుష్షుతో జీవించే మనుషులు ఉన్నారా అంటే అంతా ఈ చిన్నదేశం వైపే చూస్తున్నారు..

ప్రపంచంలోని చాలా దేశాలు అల్పాయుర్ధాయం, వృద్ధాప్య జనాభా వంటి కారణాలతో ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్ దేశస్థులు మాత్రం మంచి ఆయుర్ధాయాన్ని అనుభవిస్తున్నారు. వీరి లాంగ్ లైఫ్ కి సీక్రెట్ ఏంటా అంటే వారు తీసుకునే ఆహారమే అంటున్నారు. ఈ విషయంలో జపాన్, కొరియన్ దేశస్థులు అందరికన్నా ముందున్నారు. వారు ఏది పడితే అది తినడం కాకుండా పోషకాహారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారట. అదే వారిని ఎక్కువ కాలం జీవించేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ కాలం జీవించడమే కాదు.. ఉన్నన్ని రోజులూ ఏ రోగాలు నొప్పులు లేకుండా ఉంటారట ఇక్కడి ప్రజలు. వీరు పాటిస్తున్న సీక్రెట్ ఇదే..
అంత సంతోషంగా ఎలా బతుకేస్తున్నారు..
మొనాకో అనే దేశంలో ఎవ్వరిని చూసినా కనీసం 80 ఏళ్లకు పైబడే బతికేస్తారట. ఈ దేశస్థులు ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్ధాయం కలిగిన వ్యక్తులుగా పేరు గాంచారు. ఇక్కడ పురుషులైతే కనీసం 89 ఏండ్లు, మహిళలైతే 84 ఏండ్లు ఈజీగా బతికేస్తారట. మరి ఏ దేశంలోనూ సాధ్యం కానిది వీరికి మాత్రమే ఎలా సాధ్యపడుతోంది అంటే అందుకు కారణాలు లేకపోలేదు. ఇక్కడి ప్రజల జీవనశైలి ఎంతో భిన్నంగా ఉండటమే ఇందుకు కారణమట. వీరు ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధ, మంచి ఆహారపు అలవాట్లు, డబ్బుకు లోటు లేని జీవనమే వీరిని ఇన్నేండ్లు సంతోషంగా బతికేలా చేస్తుందట.
కడుపునిండా తినరట..
జపపనీయులు సాధారణంగానే చేపలు ఎక్కువగా తింటారట. సముద్రంలో లభించే ఆహారం, బియ్యం, కూరగాయలు, సముద్రపు పాచి (స్పైరులీనా), సోయా ఉత్పత్తులు వంటి తాజా, కాలానుగుణ ఆహారాలతో కూడిన సమతుల్య ఆహారం వారి దినచర్యలో భాగం. అన్నింటికన్నా ముఖ్యమైంది వీరు అందరిలా ఒకేసారి కడుపునిండా భోజనం చేయరు. ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకుని తింటారు. చక్కెర మరియు కొవ్వును తక్కువగా జోడించడం, తరచుగా గ్రీన్ టీతో పాటు సామూహికంగా భోజనం పంచుకోవడం వీరికి అలవాటు.. ముఖ్యమైన అంశాలలో పరిమాణం కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు వివిధ రకాల తక్కువ ప్రాసెస్ చేయబడిన పదార్థాలను తీసుకోవడం వంటివి జపనీస్ ఆహారపు అలవాట్లలో ముఖ్యమైన భాగం.
ఆలివ్ నూనెతోనే అన్నీ..
ఫ్రెంచ్ (ముఖ్యంగా ప్రోవెంకల్), ఇటాలియన్ మరియు మధ్యధరా ప్రభావాల మిశ్రమం అయిన మోనెగాస్క్ వంటకాలు,సముద్ర ఆహారం, కూరగాయలు మరియు ఆలివ్ నూనె వంటి తాజా పదార్థాలకు మొనాకో ప్రజలు ప్రాధాన్యం ఇస్తారు. చక్కటి భోజనం మరియు బార్బాగియువాన్ (స్టఫ్డ్ ఫ్రిటర్) మరియు పిస్సలాడియర్ (ఉల్లిపాయలు, ఆంకోవీస్ మరియు ఆలివ్‌లతో ఫ్లాట్‌బ్రెడ్) వంటి వివిధ రకాల వంటకాలు చేసుకుంటారు. వీరి వంటల్లో మొత్తం ఆలివ్ నూనెనే వాడతారట. ఇక సలాడ్లలోనూ ఇదే పాటిస్తారని చెప్తారు.
