భారత్- ఆస్ట్రేలియా దేశాల మధ్య కీలక ఒప్పందాలు

భారత్- ఆస్ట్రేలియా దేశాల మధ్య గురువారం పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య భద్రత, రక్షణ సంబంధాల్లో మరో ముందడుగు పడింది

భారత్- ఆస్ట్రేలియా దేశాల మధ్య కీలక ఒప్పందాలు
Follow us

|

Updated on: Jun 04, 2020 | 10:13 PM

భారత్- ఆస్ట్రేలియా దేశాల మధ్య గురువారం పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. దీంతో భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య భద్రత, రక్షణ సంబంధాల్లో మరో ముందడుగు పడింది. ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతంలో భద్రతా సహకారానికి సంబంధించి భారత్- ఆస్ట్రేలియా దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మధ్య ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌-ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో ఇదో నూతన అధ్యాయమనీ.. పరస్పర వాణిజ్య సహకారం పెంపొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, ఉమ్మడి ప్రాధాన్యతలని.. రెండు దేశాలు మరింత కలిసికట్టుగా పనిచేసేందుకు ఉపయోగపడతాయన్నారు అస్టేలియా ప్రధాని స్కాట్ మోరిసన్. ఈ సందర్భంగా ఇరు దేశాలు సైబర్, సైబర్-సామర్థ్యానికి సంబంధించిన టెక్నాలజీతో పాటు మైనింగ్‌, వ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు చేశారు. రక్షణ రంగ సహకారంలో భాగంగా రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాలపైనా ఎంవోయూలు కుదిరాయి. ప్రజా పరిపాలన, పాలనా సంస్కరణలు, వృత్తి విద్య- శిక్షణ, నీటి వనరుల నిర్వహణలో రెండు దేశాలు సహకరించుకోవాలి నిర్ణయించారు.