AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Texas: ప్రియుడికి ఫోన్‌ చేసిన యువతి.. వేరే అమ్మాయి గొంతు విని ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

అమ్మాయిలు సాధారణంగా తాము ప్రేమించిన వ్యక్తి తనతోనే ఉండాలని, మరే ఇతర అమ్మాయిలతోనూ సన్నిహితంగా ఉండకూడదని భావిస్తారు. పొరబాటున తన ప్రియుడు తనను కాదని మరొకరితో స్నేహంగా ఉంటే భరించలేరు...

Texas: ప్రియుడికి ఫోన్‌ చేసిన యువతి.. వేరే అమ్మాయి గొంతు విని ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Fire Accident
Ganesh Mudavath
|

Updated on: Nov 25, 2022 | 6:59 AM

Share

అమ్మాయిలు సాధారణంగా తాము ప్రేమించిన వ్యక్తి తనతోనే ఉండాలని, మరే ఇతర అమ్మాయిలతోనూ సన్నిహితంగా ఉండకూడదని భావిస్తారు. పొరబాటున తన ప్రియుడు తనను కాదని మరొకరితో స్నేహంగా ఉంటే భరించలేరు. సరిగ్గా ఇలాంటి మనస్తత్వమే ఉన్న ఓ అమ్మాయి తన ప్రియుడిపట్ల ఊహించని దారుణానికి ఒడిగట్టింది. ఆమె చేసిన పనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు ఆమెది ప్రేమేనా అంటూ మండిపడుతున్నారు. టెక్సాస్‌కు చెందిన ఓ యువతి స్థానికంగా ఉండే ఓ అబ్బాయిని ప్రేమించింది. అతడు కూడా ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఆ అమ్మాయి తన ప్రియుడికి ఫోన్‌ చేసింది. అవతల తన ప్రియుడికి బదులు వేరే అమ్మాయి గొంతు వినబడింది. తాను ప్రేమించినవాడి ఫోన్ లో వేరే అమ్మాయి గొంతు వినబడేసరికి ఆ అమ్మాయిలో కోపం, అసూయ కట్టలు తెంచుకున్నాయి.

అంతే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రియుడి ఇంటికి వెళ్లింది. మెల్లగా ఇంట్లోకి వెళ్ళి అతని ఇంట్లో ఉన్న ఖరీదైన సోఫాను తగలబెట్టేసింది. ఆ తర్వాత ఇంట్లోని విలువైన వస్తువులన్నీ తీసుకొని వెళ్లిపోయింది. ఇంతలో మంటలు కాస్తా పెద్దవైపోయి ఇల్లంతా వ్యాపించాయి. ఆమె అక్కడి నుంచి వెళ్లిన తరువాత ఆమె ప్రేమించిన అబ్బాయికి మీ ఇల్లు చాలా బాగానే ఉంటుంది అనుకుంటా.. అంటూ మెసేజ్ పెట్టింది. ఆమె మెసేజ్ లో ఏదో వెటకారం ఉందని గ్రహించిన అతడు వెళ్ళి చూడగా ఇల్లంతా కాలిపోతూ కనిపించింది. ఇంట్లో అమర్చిన సిసి కెమెరా ఆధారంగా తను ప్రేమించిన అమ్మాయే ఆ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

జరిగిన సంఘటనలో సుమారు 50వేల డాలర్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. యువతి తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమెది ప్రేమ కాదు.. ఉన్మాదం అంటూ కామెంట్స్‌ చేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం