పెళ్లి ముందు రోజు నవ వధువు ‘సీక్రెట్ రొమాన్స్’.. సోషల్ మీడియాలో చాటింగ్ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసిన ప్రియుడు.. విడాకులు కోరుతున్న భర్త..

పెళ్లికి ముందు అమ్మాయితో తాను చేసిన చాటింగ్‌.. స్క్రీన్‌షాట్‌లను ఆ యువతి ప్రియుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో తమ కోడలు నిర్వాకం.. కట్టుకున్న భర్తకు మాత్రమే కాదు..  అత్తమామలకు కూడా తెలిసింది. మరోవైపు సోషల్ మీడియాలో పెళ్లికూతురు ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

పెళ్లి ముందు రోజు నవ వధువు 'సీక్రెట్ రొమాన్స్'.. సోషల్ మీడియాలో చాటింగ్ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసిన ప్రియుడు.. విడాకులు కోరుతున్న భర్త..
The lover of a cheating Chinese bride
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2022 | 10:13 AM

పెళ్ళికి ముందు అమ్మాయి.. మరో అబ్బాయితో ప్రేమ, వ్యక్తిగత హద్దులు దాటి ప్రవర్తించడం.. వంటి చర్యలను.. ఏ భర్త అంగీకరించడని తాజాగా చోటు చేసుకున్న సంగతి ద్వారా మరోసారి వెల్లడింది. ఓ యువకుడు నవ వధువు పెళ్ళికి ముందు చేసిన పని తెలుసుకుని షాక్ తిన్నాడు. పెళ్లికి ముందు రోజు రాత్రి ఆ అమ్మాయి..  పెళ్లికూతురు వేషంలో తన ప్రియుడిని కలిసింది. అంతేకాదు ఆరోజు అతడితో శారీరక సంబంధం కూడా పెట్టుకుంది. అయితే ఆ యువతి  ప్రేమికుడు చేసిన పొరపాటుతో.. నవ వధువు ‘సీక్రెట్ రొమాన్స్’ని బట్టబయలు అయింది. అమ్మాయి ప్రియుడు ‘షో ఆఫ్’ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాట్ కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశాడు. దీంతో నవ వధువు పెళ్ళికి ముందు రోజు చేసిన పని వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వధువు సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది.

పెళ్లికి ముందు అమ్మాయితో తాను చేసిన చాటింగ్‌.. స్క్రీన్‌షాట్‌లను ఆ యువతి ప్రియుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో తమ కోడలు నిర్వాకం.. కట్టుకున్న భర్తకు మాత్రమే కాదు..  అత్తమామలకు కూడా తెలిసింది. మరోవైపు సోషల్ మీడియాలో పెళ్లికూతురు ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు నగరంలోని ప్రజలు కూడా ఆ అమ్మాయిని చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. వివాహ వేడుకకు 24 గంటల ముందు.. ఆ యువతి ప్రియుడితో శారీరకంగా కలిసింది. అయితే ఓ నెటిజన్ ఆ ప్రియుడిని ఆమె గర్భం దాల్చితే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి అని ఆడితే.. ఆ ప్రియుడు.. ఆ బిడ్డకు తండ్రిని ‘దేవుడే నిర్ణయించాలి’ అంటూ కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు. దీంతో నెటిజన్లు ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చూసి ఆ అమ్మాయి ఊరు వదిలి ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విడాకులు కోరుతున్న భర్త: స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్న నవ వధువు ఇప్పుడు నలుగురికి ముఖం చూపించలేక దాక్కోవాల్సి వచ్చింది.  అదే సమయంలో.. తన భార్య చేసిన మోసంతో అవమానానికి గురైన భర్త..  ఆ యువతిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ అమ్మాయితో కలిసి తాను ఒకే ఇంట్లో జీవించలేనని.. చెప్పాడు. ఎఫ్‌ఐఆర్‌తో పాటు విడాకుల కోసం భర్త దరఖాస్తు చేసుకున్నాడు.  US$28,000 నిశ్చితార్థ, పెళ్లి బహుమతులను తిరిగి తీసుకున్నాడు

ఇవి కూడా చదవండి

అమ్మాయి లవర్ చైనా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో జియోబైలాంగ్ పేరుతో యాక్టివ్‌గా ఉంటాడు. మీడియా నివేదికల ప్రకారం.. జియోబైలాంగ్.. తన ప్రియురాలు పెళ్ళికి ముందు చేసిన చాట్‌లన్నింటినీ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను అంటే.. అమ్మాయిలకు ఎంత క్రేజో  చూపించుకునేందుకు ప్రియుడు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రేమికుడి చేసిన పని పెళ్లికూతురు పెళ్ళికి జీవితానికి ఎసరు పెట్టింది. అంతేకాదు ఇలాంటి అమ్మాయిలను చూస్తుంటే తాము పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నామని మరికొందరు యువకులు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..